Telugu News » రోజా జ‌బ‌ర్ద‌స్త్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే….నాగ‌బాబుకు డ‌బుల్..!

రోజా జ‌బ‌ర్ద‌స్త్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే….నాగ‌బాబుకు డ‌బుల్..!

by AJAY MADDIBOINA

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రానించిన న‌టి రోజా ప్ర‌స్త‌తం బుల్లి తెర‌పై సంద‌డి చేస్తోంది. సాధార‌ణంగా సీనియ‌ర్ హీరోయిన్ లు రీఎంట్రీ ఇచ్చి అక్క‌, వ‌దిన మ‌రియు త‌ల్లి లాంటి ముఖ్య‌మైన పాత్ర‌లు చేస్తుంటారు. కానీ రోజా మాత్రం అందుకు భిన్నంగా బుల్లితెర‌పైకి జ‌డ్జిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ముందుగా రోజా సినిమాల్లో కూడా న‌టించింది. కానీ ఆశించిన మేర ఆఫ‌ర్లు రాలేద‌నే చెప్పాలి కానీ జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా నాగ‌బాబుతో పాటూ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించ‌గా ఈ కామెడీ షో సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది.

ALSO READ :  BHEEMLA NAYAK “భీమ్లా నాయ‌క్” లో వినాయ‌క్ పాత్ర‌ను కూడా క‌ట్ చేశార‌ట‌…!

జ‌బ‌ర్ద‌స్త్ షోకు ఎంతో గుర్తింపు రావ‌డంతో రోజా నాగ‌బాబుకు భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు. అయితే ముందు నాగ‌బాబుకు ఈ షోలో ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చేవారు. కానీ నాగ‌బాబు ఈ షోకు గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. దాంతో జ‌బ‌ర్ద‌స్త్ లో రోజా మెయిన్ జడ్జిగా మారారు. ఇక ఈ షో మొద‌ట్లో నాగ‌బాబుకు ఎపిసోడ్ కు రూ.4ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇప‌చ్చేవారు. అంతే కాకుండా రోజాకు కూడా ఎపిసోడ్ కు రూ.2 ల‌క్ష‌ల రెమ్యున‌రేషన్ ఇచ్చేవారు.

ఇక నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్ నుండి నాగ‌బాబుకు బ‌య‌ట‌కు వెళ్ల‌గా రోజా రెమ్యున‌రేష‌న్ ను డ‌బుల్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం రోజాకు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.8 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌బ‌ర్ద‌స్త్ కు పోటీగా ఎన్నో కామెడీ షోలు వ‌చ్చినా అవి నిల‌బ‌డ‌లేద‌నే చెప్పాలి. దాంతో జ‌బ‌ర్ద‌స్త్ స‌క్సెస్ కోసం కృషి చేసిన క‌మెడియ‌న్ ల‌కు కూడా రెమ్యున‌రేష‌న్ లు భారీగా పెంచిన‌ట్టుగా తెలుస్తోంది.

Roja

Roja

ఇదిలా ఉంటే రోజా ప్రస్తుతం జ‌బ‌ర్ద‌స్త్ కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ అప్పుడ‌ప్పుడూ ఇత‌ర టీవీ షోల‌లో కూడా సందడి చేస్తూ ఉంటారు. అంతే కాకుండా రాజకీయాల్లోనూ ఎంతో బిజీగా ఉంటూ ప్ర‌జాసేవ‌చేస్తున్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ గా త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

You may also like