Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » బ్రహ్మాస్త్రం అన్నట్లుగా బ్రాహ్మణిని వదిలారు.. కానీ పాపం తుస్సుమంది – రోజా సంచలనం

బ్రహ్మాస్త్రం అన్నట్లుగా బ్రాహ్మణిని వదిలారు.. కానీ పాపం తుస్సుమంది – రోజా సంచలనం

by Bunty
Ads

నారా బ్రాహ్మణికి ఏపీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారు.. తీరా ఈ అస్త్రం కూడా తుస్సుమందంటూ ఎద్దేవా చేశారు రోజా.  దొరికిన దొంగను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా?? అని నారా బ్రాహ్మణికి ఏపీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించకండని.. మా తాత ఇంత అవినీతి పరుడా అనుకుంటాడు అంటూ సెటైర్లు పేల్చారు.

Advertisement

roja counter to brahmani

roja counter to brahmani

మీ మామ ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా?! మీ తాత ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియో ఒకసారి చూస్తే చంద్రబాబు ఏంటో అర్థం అవుతుందని అగ్రహించారు. సాక్ష్యాధారాలు లేవు అని అంటోంది బ్రాహ్మణి.. ఒకసారి సీఐడీ ఆఫీసుకు వెళ్ళి అడిగితే వాళ్ళే ఆధారాలు చూపిస్తారని చురకలు అంటించారు.  బ్రాహ్మణికి చదువు చెప్పిన వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారని.. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అనుకుంటుందా? లేక దేశానికి ప్రధానిగా చేశాడని అనుకుంటోందా?? అని మండిపడింది రోజా. ముఖ్యమంత్రి పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొడతానని హెచ్చరించారు.

Ad

Advertisement

పిచ్చి కళ్యాణ్ కు ప్రపంచంలో ఉన్న అందరూ పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారు.. ముఖ్యమంత్రి జగన్ ను నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్ళు అయింది.. రెండు సార్లు ఎమ్పీ, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఒక సారి ప్రతిపక్ష నేతగా, 151 మంది ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు రోజా. పవన్ కళ్యాణ్ బతుకు ఎంత?? రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అయినా కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేపోయాడని మండిపడ్డారు రోజా.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading