Home » బండారు సత్యనారాయణ లాంటి చీడ పురుగులకు శిక్ష పడాలి – రోజా

బండారు సత్యనారాయణ లాంటి చీడ పురుగులకు శిక్ష పడాలి – రోజా

by Bunty
Ad

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ వార్తలు నిలుస్తూ… వివాదాలకు తరలింపుతారు రోజా. అయితే అలాంటి రోజాపై గత వారం రోజుల కిందట టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రోజాకు సపోర్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ హీరోయిన్లు… బండారు సత్యనారాయణ పై కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Advertisement

ఇలాంటి తరుణంలో బండారు సత్యనారాయణ పై స్వయంగా ఏపీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తప్పులకు జైల్లో ఉంటే‌… ఆ టాపిక్ నుంచీ డైవర్ట్ చేయడానికి నన్ను టార్గెట్ చేసారన్నారు. బండారు సత్యనారాయణ లాంటి చీడపురుగులకు శిక్ష పడాలి అని డిమాండ్ చేశారు రోజా. మహిళలు అందరం కలిసి పోరాడతాం…నాలాంటి వారికే ఇలాంటి పరిస్ధితి అయితే… సాధారణ స్త్రీల పరిస్ధితి ఏంటి..? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి రోజా.

నేను దీనిని వదిలేది లేదు… క్రిమినల్ డెఫర్మేషన్ వేస్తా… సుప్రీంకోర్టు వరకూ వెళతానని హెచ్చరించారు. టిడిపి జనసేన దిగజారుడు వీడియోలు అందరికీ తెలుసు…జనసేన టిడిపి చేసే పనులు ప్రజలు చూస్తున్నారు అని మండిపడ్డారు ఏపీ మంత్రి రోజా.

Visitors Are Also Reading