Rohit Sharma out of T20 World Cup : భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి జైషా సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 జట్టులో రోహిత్ ఎంపిక గురించి ఎలాంటి హామీ ఇవ్వలేనని అన్నాడు. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టీ20 భవిష్యత్తుపై సర్వత్రా చర్చలు జరుగుతున్న సమయంలో బీసీసీఐ కార్యదర్శి జైషా ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చ నియాంశంగా మారింది.
టీ20 ప్రపంచకప్ జూన్ లో ఉందని, దానికన్నా ముందు ఐపీఎల్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఉన్నాయని బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని జైషా అన్నాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు.
Advertisement
ఎన్సీఏలో హార్దిక్ కోలుకుంటున్నాడని ఆఫ్గాన్ సిరీస్ కన్నా ముందే ఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నాడు. అలాగే కోచ్ గా ద్రవిడ్ పదవికాలం మరింత పొడిగించడంపై సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత చర్చిస్తామన్నాడు. వన్డే ప్రపంచకప్ తోనే ద్రవిడ్ పదవికాలం ముగిసిన తాత్కాలికంగా దాన్ని జూన్ లో టీ20 ప్రపంచకప్ దాకా కొనసాగించాడు. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియా.. 2023 వరల్డ్ కప్ ఓడిన సంగతి తెలిసిందే.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.