Home » IND VS NZ: బ్యాటింగా? ఫీల్డింగా? ఏం తీసుకోవాలో మర్చిపోయా, రోహిత్ వీడియో వైరల్

IND VS NZ: బ్యాటింగా? ఫీల్డింగా? ఏం తీసుకోవాలో మర్చిపోయా, రోహిత్ వీడియో వైరల్

by Bunty
Ad

కొత్త ఏడాది టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీలంక పై రెండు సిరీస్ లు గెలిచిన టీమ్ ఇండియా ఈ ఏడాది వరుసగా రెండో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. శనివారం రాయపూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0 తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే, రెండో వన్డేలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆసియా కప్ 2022 లో టీమిండియా వైఫల్యానికి కారణం టాసే అనేది అందరికీ తెలిసిన విషయం.

Advertisement

అందుకే టాస్ ఎంత కీలకమో కెప్టెన్లకు బాగా తెలుసు. అందుకే టాస్ సమయంలో ఏం తీసుకోవాలనే దానిపై టీం మీటింగ్ లో చర్చించి గెలిస్తే ఏం తీసుకోవాలనే దానిపై ఒకపక్క నిర్ణయంతో టాస్ కోసం వస్తారు కెప్టెన్లు. కానీ, రెండో వన్డేలో ఆశ్చర్యంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టాస్ గెలిచిన తర్వాత ఏమి ఎంచుకోవాలో మర్చిపోయానని, దీని కోసం టీం మీటింగ్లో చాలా చర్చించాం కానీ, నాకు గుర్తులేని టాస్ గెలిచిన తర్వాత చెప్పి, అందరికీ షాక్ ఇచ్చాడు.

Advertisement

టీం విజయం కోసం ఎంతో కసితో ఉండే రోహిత్ శర్మ నుంచి ఇలాంటి కామెంట్ రావడంతో క్రికెట్ అభిమానులతో పాటు, క్రికెట్ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీమ్ కు ఒక ఛాలెంజ్ విసరడం కోసం తాను తోలుత ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపారు. రోహిత్ కఠిన పరిస్థితుల్లో, ఒత్తిడిని తట్టుకుంటూ, ఎలా ఆడాలనే చాలెంజ్ ను తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోహిత్ పేర్కొన్నాడు.

READ ALSO : కలలో చనిపోయిన పూర్వీకులు కనిపిస్తున్నారా, కోటీశ్వరులు అవుతారా!

Visitors Are Also Reading