Telugu News » శంషాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాకింగ్ రాకేష్

శంషాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాకింగ్ రాకేష్

by Bunty
Ad

జబర్దస్త్ షో లో టీం లీడర్ గా అలాగే… సినిమాలో నటుడిగా రాకింగ్ రాకేష్ మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టైమింగ్ లో పంచులు పేలుస్తూ… కంటెస్టెంట్ నుంచి టీం లీడర్ గా రాకింగ్ రాకేష్ ఎదిగాడు. అయితే తాజాగా రాకింగ్ రాకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. శంషాబాద్ మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ గా రాకింగ్ రాకేష్ ఎంపికయ్యారు.

Advertisement

Advertisement

ఆదివారం శంషాబాద్ లో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ గా అధికారులు రాకింగ్ రాకేష్ ను ఎంపిక చేశారు.

అనంతరం ఎలైట్ హోటల్ లో మున్సిపల్ సిబ్బంది మరియు అంగన్వాడి టీచర్లకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం లో మున్సిపల్ చైర్ పర్సన్ సహా పలువురు కౌన్సిలర్లు హాజరై.. రాకింగ్ రాకేష్ ను అభినందించారు.

Visitors Are Also Reading