RK : మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని…రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలను అభిమానించే వ్యక్తిని అని తెలిపారు. నా రాజకీయ ప్రయాణం షర్మిలతోనే అంటూ కీలక ప్రకటన చేశాడు ఆర్కే. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే నేను ఉంటానని ప్రకటించేశాడు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వివరించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.
Advertisement
నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేయాలనుకుంటే రెండేళ్ల క్రితం రాజీనామా చేసేవాడ్ని అంటూ స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 175 సీట్లు గెలుస్తానంటున్న ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు. కుప్పం, పులివెందుల నియోజకవర్గాలను టార్గెట్గా పెట్టుకున్న ప్రభుత్వం మిగతా నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయాలని కోరారు.
1200 కోట్లు మంగళగిరి అభివృద్ధికి కేటాయిస్తానన్న ముఖ్యమంత్రి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. మంగళగిరి అభివృద్ధిలో ప్రభుత్వ సహకారం లేదన్నారు. ఎన్నిసార్లు సీఎంఓ చుట్టూ తిరిగిన స్పందన లేదు…సీఎంఓలో అధికారులు….. ఎమ్మెల్యేలను పురుగులు చూసినట్టు చూస్తున్నారని ఫైర్ అయ్యారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. అలాంటి పార్టీలో నేను ఎందుకు ఉండాలన్న ఆలోచనతోనే రాజీనామా చేశానన్నారు. ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను…. నాకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.