దక్షిణ ఆఫ్రికా పర్యటనలో భాగంగా నిన్న జరిగిన రెండవ టి20 సిరీస్ లో వర్షం భారత్ ను దెబ్బకొట్టింది. అయితే వర్షం కారణంగా ఓవర్లు కుదించడం వల్ల దక్షిణాఫ్రికా ఇండియా పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లోలో రింకు సింగ్ సఫారీ జట్టుపై చెలరేగిపోయాడు. బౌండరీలు సిక్సర్లతో విజృంభించాడు. రింకు ఆట చూసిన కొందరు మాజీలు ఇండియాకి ధోని లాంటి ఫినిషర్ లభించాడని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
మ్యాచ్ విషయానికొస్తే మూడు టి20 సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగ రెండవ మ్యాచ్లో ఇండియా పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీనితో ఇండియా పరాజయంతో మ్యాచ్ మొదలు పెట్టినట్టు అయింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియ 19.3 ఓవర్స్లో 7 వికెట్స్ కి 180 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన భారత్ కి ఓపెనర్లు ఇద్దరు డకౌట్ గా పెవిలియన్ చేరారు. దీంతో ఆరు పరుగులకి ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.
ఈ క్రమంలో 29 పరుగులు చేసిన తిలక్ అవుట్ అవ్వగా ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన రింకు సింగ్తో సూర్య కుమార్ యాదవ్ మరొక కీలక బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో సూర్య 36 బంతుల్లో 56 పరుగులు చేశాడు అలాగే రింకు కూడా 39 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సూర్య అవుట్ అయిన తర్వాత జడేజా 19 పరుగుల కీలక మైన పరుగులను చేశాడు. దీంతో భారత్ 19.3 ఓవర్లు 182 పరుగులు చేసింది. అయితే వర్షం పడిన కారణంగా టార్గెట్ ను కుదించడంతో సౌత్ ఆఫ్రికాకు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. డక్ వార్తు లూయీస్ పద్ధతి ప్రకారం 13.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 154 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. కాగా, సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా హిట్టర్ రింకూ సింగ్ రెచ్చిపోయారు. 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 రన్స్ సాధించి తన కెరీర్లో తొలి అర్ధ సెంచరీ సాధించారు. ఈ క్రమంలో రింకూ కొట్టిన ఓ సిక్సర్కు మీడియా బాక్స్ అద్దం పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!