కొంతమందికి జంతువులపై ఉండే ప్రేమ అంతా ఇంతా కాదు. జంతువులను సైతం అల్లారు ముద్దుగా కుటుంబ సభ్యుల్లా భావిస్తూ పెంచుకుంటారు. అలా పెంచుకుంటున్న సమయంలో జంతువులకు ఎంతో దగ్గరవుతుంటారు. అయితే వాటిని కుటుంబ సభ్యుల్లా పెంచుకోవడమే కాదు విదేశాల్లో తమ ఆస్తులకు తమ పెంపుడు జంతువులే వారసులు అని ప్రకటిస్తున్న సంఘటనలు కూడా చూస్తునే ఉన్నాం. ఇక అలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కవ సంపద కలిగి ఉన్న జంతువుల నివేధిక చూస్తే ఒక్కో పెంపుడు జంతువు పేర మిలియన్లలో ఆస్తులు ఉన్నాయి. అలా ఆస్తులు కలిగి ఉండి సంపన్నమైన పెంపుడు జంతువులు ఏవో ఇప్పుడు చూద్దాం….
Advertisement
గుంతర్ : ఇది ఒక జర్మన్ షపర్డ్ జాతికి చెందిన కుక్క. దీని ఆస్తి విలువ ఏకంగా 375 మిలియన్ డాలర్లు కాగా ప్రపంచంలోనే ఇది సంపన్నమైన జంతువు.
Advertisement
చౌపిట్టి : ఇది ఓ పర్శియన్ జాతికి చెందిన పిల్లి దీని ఆస్తి విలువ ఏకంగా వంద మిలియన్ డాలర్లుగా ఉంది.
గ్రంపీ : ఇది కూడా ఓ పిల్లి…అమెరికన్ జాతికి చెందిన ఈ పిల్లి ఆస్తి విలువ కూడా వంద మిలియన్ డాలర్లుగా ఉంది.
టాబీరిమ్స్ : ఇది ఓ కుక్క..దీని ఆస్తి విలువ ఏకంగా 92మిలియన్ డాలర్లు.
కాలు: ఇది ఒక చింపాజీ…దీని ఆస్తి విలువ 90 మిలియన్ డాలర్లు..అంతేకాకుండా ప్రపంచంలోనే ఇది సంపన్నమైన చింపాజీ.
జిగూ: ఇది ఓ కోడి దీని ఆస్తి విలు 15 మిలియన్ డాలర్లపైనే ఉంటుంది.