పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్ లా నాయక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సంచలనాల దర్శకుడు ఆర్జీవీ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలి అంటూ వరుస ట్వీట్స్ చేశారు. ఆర్జీవీ తన ట్వీట్స్ లో పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ కోరారు.
పవన్ కల్యాణ్ గారూ ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు…ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి. పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము. …అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా.
Advertisement
Advertisement
దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి.
Also Read: పుష్ప కోసం క్రికెటర్లు పెయిడ్ ప్రమోషన్స్..? ఈ ప్లాన్ ఎవరు చేశారంటే..?
ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారూ??? అంటూ వర్మ వరుస ట్వీట్ లు చేశారు. ఇక వర్మ చేసిన ట్వీట్ లకు మీ సినిమా కొండా ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయండి అంటూ పవన్ ఫ్యాన్స్ సెటైర్ లు వేస్తున్నారు.
ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా @pawanKalyan గారూ???
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022