సినిమా టికెట్ల వివాదంపై పరిష్కారం కోసం చిరంజీవి టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు దర్శకులతో కలిసి సీఎం జగన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్ మాట్లాడుతూ… రెండు వారాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుండి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పారు. అంతేకాకుండా చిన్న సినిమాలకు రోజుకు ఐదు షోలు వేసుకునేలా అనుమతులు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఎఎపి ప్రభుత్వం కూడా చిరంజీవి కృషిని అభినందించింది. ఇదిలా ఉంటే సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ టికెట్ల అంశంపై వైసీపీ ప్రభుత్వం సెటైర్లు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీకి సంబంధించిన వీడియోను ఆర్జీవి షేర్ చేశారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి పై వర్మ సెటైర్లు కురింపిచారు. మెగా ఫ్యాన్ గా మెగా బెగ్గింగ్ చూసి హర్ట్ అయ్యాను అంటూ వర్మ తన ట్వీట్ లో పేర్నొన్నారు.
Advertisement
Advertisement
మీరు అలా అడుక్కోవడం మెగాఫ్యాన్స్ ను బాధించింది అంటూ కామెంట్లు చేశారు. మీ తమ్మడు పవన్ కల్యాణ్ మీలాగా ఎప్పుడూ చేయరు. అందుకే ఇతర విషయాలలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఇష్టపడరు. అంతే కాకుండా మీకంటే ఆయన ఎక్కువ పాపులారిటీ సంపాదించుకోవడానికి కూడా అదే కారణం. అంటూ ఆర్జీవి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే వర్మ చేసిన వరుస ట్వీట్లను కొద్దిసేపట్లోనే డిలీట్ చేశాడు. దాంతో రాత్రి వొడ్కా మత్తులో ఆర్జీవీ ట్వీట్లు చేశాడని ఆ తర్వాత వాటిని డిలీట్ చేశాడు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మెగా అభిమానులు కూడా వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సున్నితంగా సమస్యలు పరిష్కరిస్తుంటే మధ్యలో వర్మ గోల ఏంటని ప్రశ్నిస్తున్నారు.