Telugu News » Blog » పవన్ కళ్యాణ్ కేఏ పాల్ మాట వినాలి….ఆర్జీవీ సెటైర్లు…!

పవన్ కళ్యాణ్ కేఏ పాల్ మాట వినాలి….ఆర్జీవీ సెటైర్లు…!

by AJAY
Ads

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై సెటైర్ లు వేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.పవన్ సినిమాలు పొలిటికల్ లైఫ్ ఇలా ప్రతీ దానిపై వర్మ తనదైన స్టైల్ లో సెటైర్ లు వేస్తుంటారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయం లోనూ వర్మ పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేసారాన్న సంగతి తెలిసిందే.

Advertisement

మెగా ఫ్యాన్స్ ఫైర్ అయినా కూడా వర్మ ఎక్కడా తగ్గకుండా సెటైర్ లు విమర్శలు చేస్తూనే ఉంటారు. కాగా తాజాగా మరోసారి పవన్ రాజకీయాల పై వర్మ సెటైర్ లు కురిపించారు. పవన్ కళ్యాణ్ గురించి కేఏ పాల్ మాట్లాడిన కామెంట్స్ వీడియో ను వర్మ షేర్ చేశారు. హేయ్ పవన్ సార్ కాబోయే ప్రధాని చెప్పేది విను అంటూ ఈ వీడియో కు క్యాప్షన్ ఇచ్చాడు.

Advertisement

Advertisement

ఇక ఈ వీడియో లో కేఏ పాల్ పవన్ ఫ్యాన్స్ అందరికీ చెబుతున్నా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నా మినిస్టర్ కావాలన్నా ఒక్క శాతం నిజాయితీ ఉన్న ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరాలని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలుచుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధాని గా ఉంటా….పవన్ కళ్యాణ్ ను కావాలంటే ముఖ్యమంత్రి చేద్దాం….అంటూ పాల్ వీడియో లో అన్నారు. ఇక ప్రస్తుతం వర్మ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.