వివాదాల దర్శకుడు ఆర్జీవీ తీరు చూస్తుంటే వైసీపీ నాయకులను టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఇటీవల వరుస ట్వీట్లతో ఏపీ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన వర్మ మంత్రులపై కూడా సెటైర్లు వేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వర్మ ఏపీ మంత్రి కొడాలి నాని పై సెటైర్లు వేశారు. ఏపీలోని గుడివాడ కొడాలి నాని నియోజకవర్గం అయితే ఈ నియోజకవర్గంలో సంక్రాంతి సంధర్బంగా జూదశాల నిర్వహణ కలకలం రేపింది.
ఈ జూదశాలలో కెసీనో, అసభ్య నృత్యాలు, పేకాట, బెట్టింగులు జరుగుతున్నాయంటూ తెలుగు దేశం పార్టీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా గోవాను తలపించేలా గుడివాడలో వ్యవహారం సాగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ విషయం పైనే ఆర్జీవీ సెటైర్లు వేశారు. గుడివాడ ప్రజలకు గోవా వెళ్లిన ఫీలింగ్ ను నాని కల్పించారని అన్నారు. గుడివాడను లండన్ , పారిస్, లాస్ వెగాస్ లాంటి పట్టణాల సరసన నిలిపారు అంటూ సెటైర్లు వేశారు.
అంతే కాకుండా తాను నాని నిర్ణయాలను గౌరవిస్తున్నాను అంటూ కామెంట్లు చేశారు. గుడివాడను మోడ్రన్ గా తీర్చిదిద్దుతున్న కొడాలి నానిని తాను అభినందిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. కెసీనోకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల మాటలు పట్టించుకోకూడదు అంటూ కామెంట్ చేశారు. జై గుడివాడ అంటూ ఆర్జీవీ గుడివాడకు జై కొట్టారు.
also read : బాలయ్య ఫుడ్ మెనూ ఫుడ్ మెనూ చూస్తే అవాక్కవ్వాల్సిందే…!
చూడ్డానికి ఈ ట్వీట్ లు పొగిడినట్టు కనిపించినా వర్మ తన స్టైల్ లో సెటైర్లు వేసినట్టు క్లారిటీగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కొడాలి నానికి ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. నాని మీడియా ముందుకు వచ్చారంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే.మరి ఆర్జీవీ వ్యాఖ్యలపై నాని ఎలా స్పందిస్తారా చూడాలి.