Home » యాంకర్ శ్యామల పై ఆర్జీవీ సీరియస్…స్టేజ్ పై అలా అనడంతో …!

యాంకర్ శ్యామల పై ఆర్జీవీ సీరియస్…స్టేజ్ పై అలా అనడంతో …!

by AJAY
Ad

ఒకప్పుడు ఆర్జీవీ స్టార్ డైరెక్టర్ గా కొనసాగారు. శివ సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అప్పట్లో ఆర్జీవీ సినిమాలు అంటే ఒక క్రేజ్ ఉండేది. బాలీవుడ్ లోనూ సర్కార్ లాంటి సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా వర్మ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక తెలుగులో అయితే ఆర్జీవీ చివరగా తీసిన హిట్ సినిమా అంటే రక్త చరిత్ర పార్ట్ 1 మాత్రమే.

Advertisement

ఈ సినిమా తర్వాత వర్మ కు ఒక్క హిట్ కూడా పడలేదు. మరోవైపు వర్మ కూడా హిట్ ఫ్లాప్ తో సంబందం లేకుండా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ సినిమాలు విడుదల అయ్యేది కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. ఇక తాజాగా వర్మ లడ్కీ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించాడు.

Advertisement

ramgopal varma anchor shyamala

ramgopal varma anchor shyamala

ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా యాంకర్ శ్యామల వ్యవహరించారు. కాగా శ్యామల ఒక గేమ్ ఆడుదాం అంటూ వర్మ తో చెప్పింది. ఇతర భాషల్లో వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సినిమాలను తెలుగులో చెప్తాను అని వాటిని మీరు చెప్పాలని కోరింది.

Ramgopal varma

Ramgopal varma

మొదటగా చంపు రశీదు ఈ సినిమా పేరు చెప్పండి అంటూ వర్మ ను అడిగింది. దానికి వర్మ తల గోక్కుంటూ సైలెంట్ గా ఉండిపోయాడు. దాంతో శ్యామల కిల్ బిల్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక వర్మ ఇది జోకా అంటూ సీరియస్ గా శ్యామలని చూసాడు. ఇది సీరియస్ సినిమా ఇలాంటి జోకులు వద్దు అంటూ వెళ్లిపోయాడు. తరవాత శ్యామల ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే స్వారీ అని చెప్పింది.

Visitors Are Also Reading