Telugu News » ల‌వ్‌లో ప‌డిపోయిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌..!

ల‌వ్‌లో ప‌డిపోయిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌..!

by Anji

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నంద‌మూరి బాల‌కృష్ణ ల‌వ్‌లో ప‌డిపోయారు. అదేమిటి..? బాల‌య్య‌తో ఆర్జీవీ ల‌వ్ ఏమిటి అని ఆశ్య‌ర్య‌పోతున్నారా..? అదేమిటంటే.. ఆహాలో ప్ర‌సారం అవుతున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే షోతో ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు వ‌ర్మ‌. టాలీవుడ్ హీరో బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సందడి చేసారు.

Ads

లవ్‌లో పడిపోయిన ఆర్జీవీ... బాలయ్యకు రిక్వెస్ట్..!

మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, పూరిజ‌గ‌న్నాథ్‌, అల్లుఅర్జున్‌, ర‌వితేజ‌, రానా, నాని బ్ర‌హ్మ‌నందం, ఎం.ఎం.కీర‌వాణి ల‌తో పాటు చాలా మందిని ఈ షోకు ఆహ్వానించారు బాల‌య్య‌. వారితో చేసిన హ‌డావుడి మామూలుగా లేదు మ‌రీ. ఆహాకు మంచి వ్యూస్ తెచ్చి పెడుతున్నాయి.

తాజాగా వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అన్‌స్టాపుల్ ఎన్‌బీకే ప్రోగ్రామ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిన‌ది. దేనికి అంత ఈజీగా టెంట్ కానీ ఆర్జీవీ ఉన్న‌ట్టుండి బాల‌య్య వ్యాఖ్యాత‌గా చేస్తున్న ప్రోగ్రామ్ అంటే త‌న‌కు ఎంతో ఇష్టం అని తెలిపారు. అన్‌స్టాప‌బుల్ ప్రోగ్రామ్‌ను అంద‌నంత ఎత్తుకు ఎత్తేసారు. ఇది ఒక స్ట్రాటో ఆవ‌ర‌ణ ప్రోగ్రామ్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. అదేవిధంగా నాకు కూడా ఓ అవ‌కాశం ఇవ్వండి అంటూ ట్వీట్ చేసారు ఆర్జీవీ. ఇప్ప‌టికే ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా కూడా రికార్డు సృష్టించిన ఈషోపై ఆర్జీవీ మ‌నసు పారేసుకోవ‌డంతో ఆయ‌న‌ను బాల‌య్య ఆహ్వానిస్తారా..? లేక అవ‌కాశం వ‌స్తే వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ ఎలా ఉండ‌బోతుంది..? వీరిద్ద‌రి ఎపిసోడ్ హైలెట్‌గా నిలువ‌నుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


You may also like