Home » చర్చలకు పిలిచినా తగ్గని వర్మ…ఏపీ ప్రభుత్వానికి మరో కౌంటర్…!

చర్చలకు పిలిచినా తగ్గని వర్మ…ఏపీ ప్రభుత్వానికి మరో కౌంటర్…!

by AJAY
Ad

ఆర్జీవీ తో ఎవరు పెట్టుకున్నా ఆర్జీవీ ఎవరితో పెట్టుకున్నా వారిని అంతా ఈజీగా వదలరు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ ఇంటర్వ్యూలు సోషల్ మీడియా ద్వారా ఆర్జీవీ తనదైన స్టైల్లో రెచ్చిపోతూనే ఉంటారు. ఇక ప్రస్తుతం ఆర్జీవి వర్సెస్ ఏపీ సర్కార్ అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గించడం… ధరలు పెంచేది లేదని స్పష్టం చేయడం తో పలువురు సినీ ప్రముఖులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Advertisement

Cm jagan rgv

Cm jagan rgv

మరికొందరు మాకెందుకులే అని సైలెంట్ గా ఉన్నారు. అయితే ఒకప్పుడు టిడిపి పై వరుస విమర్శలు చేసిన వర్మ మాత్రం ఇప్పుడు టికెట్ ధరల అంశం పై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి పేర్ని నాని ఆర్జివి మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. ఆ తర్వాత పేర్ని నాని ఈ నెల 10వ తేదీన చర్చలకు రావాలంటూ ఆర్జివిని ఆహ్వానించారు.

Advertisement

 

దాంతో అంతా వర్మ కూల్ అయ్యాడు అనుకున్నారు. అయినప్పటికీ వర్మ తగ్గట్లేదని తాజాగా చేసిన ట్వీట్స్ చూస్తుంటే కనిపిస్తోంది. రీసెంట్ గా వర్మ ” సినిమాల మాదిరిగానే థీమ్ పార్క్ లు, మ్యూజిక్ కన్సర్ట్ లు, మ్యాజిక్ షోలు వైగైరా వగైరా కూడా ఎంటర్ టైన్మెంట్స్ కిందకే వస్తాయి. కానీ ఆ టికెట్ల ధరలు కూడా ప్రభుత్వం నియంత్రించదు.” అంటూ పేర్కొన్నారు. మరి దీనిపై ఏపీ సర్కార్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

Visitors Are Also Reading