Home » మెగా హీరోల పై వర్మ సెటైర్లు…అల్లు అర్జున్ ఒక్కడే అసలైన మెగా అంటూ…!

మెగా హీరోల పై వర్మ సెటైర్లు…అల్లు అర్జున్ ఒక్కడే అసలైన మెగా అంటూ…!

by AJAY
Ad

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో చెప్పడం చాలా కష్టం. అప్పట్లో ఆర్జివి పవన్ కళ్యాణ్, టీడీపీలను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏం చేసినా వర్మ తనదైన స్టైల్ లో స్పందిస్తూ విమర్శలు చేస్తూ ఉండేవాడు. అంతే కాకుండా ఏకంగా పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా సినిమాలు కూడా తీశాడు. అదేవిధంగా టిడిపి పై కూడా అదే రేంజ్ లో వర్మ సెటైర్లు వేయడం.. సినిమాలు చేయడం చూసాం.

 ఇక వర్మ గత కొంతకాలంగా అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూనే మెగాఫ్యామిలీపై హీరోలపై ఇండైరెక్ట్ విమర్శలు చేస్తున్నారు. నిజానికి ముందు నుండి ఆర్జివి అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అల్లుఅర్జున్ నటనకు అభిమాని అని చెబుతూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ ఒక్కడే అసలైన మెగా అని కష్టతరమైనా ఇదే కాదనలేని వాస్తవం అంటూ వర్మ పేర్కొన్నారు. మరోవైపు పుష్ప సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ నటన పై కూడా వర్మ ప్రశంసలు కురిపించారు.

Advertisement

Advertisement

Ramgopal varma

Ramgopal varma

అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని గొప్ప నటుడు అని పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీ లో అల్లు అర్జున్ మంచి నటుడు అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోనే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో రికార్డులు క్రియేట్ చేశాడు అని పేర్కొన్నాడు. అయితే వర్మ బన్నీ పై ప్రశంశలు కురిపించడం లో తప్పు లేదు కానీ అందులో మెగా ఫ్యామిలీ ని లాగటమే మెగా అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇక తాజాగా వర్మ చేసిన ట్వీట్ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read : స్టార్ క‌పుల్స్ విడాకులు మంచి ట్రెండ్… అదో సందేశం…ద‌నుష్ ఐశ్వ‌ర్య‌ డివోర్స్ పై వ‌ర్మ‌…!

Visitors Are Also Reading