సినిమా తారలు పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తరవాత కొంత కాలానికి విడాకులు కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఈ ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్ లో కనిపించేది. కానీ ఇప్పుడు సౌత్ లోనూ సెలబ్రెటీలు ఇదే దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది.
Advertisement
Ad
ఇటీవల ఈ విడాకుల కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే స్టార్ కపుల్ సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
danush aishwarya
అయితే తాజాగా తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి తమిళ స్టార్ హీరో దనుష్ ఐశ్వర్య అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే తాజాగా ఈ అంశం పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్లు చేశారు. పెళ్లి అంటేనే అసలు గిట్టని వర్మ వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు. తెలివైన వాళ్లు ప్రేమించుకుంటారని….తెలివిలేని వాళ్లే పెళ్లి చేసుకుంటారని వర్మ పేర్కొన్నారు. పెళ్లి అనేది ఇద్దరి మధ్య ఉండే ప్రేమను చంపేస్తుందని అన్నారు.
Advertisement
Danush Aishwarya
పెళ్లి తరవాత కేవలం రెండు మూడు రోజులు మాత్రమే హ్యాపీగా ఉంటారని వర్మ పేర్నొన్నారు. పెళ్లి కంటే త్వరగా ఏది కూడా ప్రేమను చంపలేదని అన్నారు. అందుకే ఎంతకాలం ప్రేమించుకుంటారో ప్రేమించుకుని ఆ తరవాత ఎవరి దారి వాళ్లు చూసుకోవాలని వర్మ తెలిపారు. కేవలం విడాకులు మాత్రమే సంగీత్ లాంటివి ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకోవాలని వర్మ తెలిపారు. పెళ్లి అనేది ఒకరిలో ఉన్న భయంకర క్వాలిటీలను మరొకరు వెతకడానికి మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు.
ALSO READ : మళ్లీ దొరికిపోయిన రష్మిక…..రౌడీ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్…ఫోటోలు వైరల్..!