Home » అన్ స్టాపబుల్ పై ఆర్జీవీ ప్రశంసలు…ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బాలయ్యకు రిక్వెస్ట్ …!

అన్ స్టాపబుల్ పై ఆర్జీవీ ప్రశంసలు…ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బాలయ్యకు రిక్వెస్ట్ …!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టపబుల్ ఎన్బీకే. ఇప్పటివరకు సమంత తమన్నా లాంటి హీరోయిన్లు టాక్ షోలు చేశారు. కానీ మొదటి ఇక హీరోలలో రానా టాక్ షో చేశాడు. కానీ సీనియర్ హీరోల్లో మాత్రం  ఆ క్రెడిట్ బాలయ్యకు మాత్రమే దక్కింది. అంతే కాకుండా బాలయ్య ఆహా ఓటిటిలో టాక్ షో చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Balayya

Balayya

ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు వచ్చినా బాలయ్య టాక్ షోకు ఎంతో రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు బాలయ్య షోకు దిగ్గజాలు వస్తున్నారు. రీసెంట్ గా ఈ షో ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షోగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. దానికి కారణం బాలయ్య చలాకీగా ప్రశ్నలు అడగటం తో పాటు వచ్చిన అతిథులతో ఆడుకోవడమే. అయితే తాజాగా సంచలనాల దర్శకుడు ఆర్జీవీ సైతం ఈ షో పై ప్రశంసలు కురిపించారు.

Advertisement

Advertisement

Balayya unstoppa

Balayya unstoppable

నేను ఆహా లో వస్తున్న అన్ స్టాపబుల్ ను స్ట్రాటో కంటే ఎత్తుగా ఉండే అంత ఎక్కువ లవ్ చేస్తున్నాను. నేను ఆ షోకు వెళ్లాలని కోరుకుంటున్నాను. బాలయ్య గారు నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు. మరి బాలయ్య ఆర్జీవికి అవకాశం ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

Ramgopal varma

Ramgopal varma

నిజానికి బాలయ్య ఆర్జీవీ కి అవకాశం ఇస్తే వీరిద్దరి ఎపిసోడ్ హైలెట్ గా నిలవనుంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం బాలయ్య ఆర్జీవీ నచ్చినట్టు ఉంటారని…. ఏది అనాలని అనుకుంటే అది మొహమాటం లేకుండా అనేస్తారని అనుకుంటున్నారు. మరి నెటిజన్ల కోరిక తీరుతుందా లేదా చూడాలి.

Visitors Are Also Reading