Home » RAM GOPAL VARMA : హీరోయిన్ తో ఆర్జీవీ ముద్దులు…ముస‌లాడే కానీ మ‌హానుభావుడంటూ ట్రోల్స్..!

RAM GOPAL VARMA : హీరోయిన్ తో ఆర్జీవీ ముద్దులు…ముస‌లాడే కానీ మ‌హానుభావుడంటూ ట్రోల్స్..!

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ ద‌ర్శ‌కుడిగా పేరున్న రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు వివాదాల ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు. ఇటీవ‌ల వ‌ర్మ ఏపీ ప్ర‌భుత్వం టికెట్ల అంశంపై ప్ర‌ద‌ర్శిస్తున్న తీరును ఎండ‌గ‌డుతూ విమ‌ర్శలు కురిపించి అంద‌రి చేతా శ‌భాష్ అనిపించుకున్నాడు. కానీ తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోతో మ‌ళ్లీ విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నాడు. గ‌తంలో ఆర్జీవీ ఓ టాలీవుడ్ న‌టితో మ‌ద్యం మ‌త్త‌లో చిందులు వేసిన సంగ‌తి తెలిసిందే.

rgv with actress

Advertisement

అంతే కాకుండా యాంక‌ర్లు, హీరోయిన్ల‌తో వ‌ర్మ ఎంజాయ్ చేస్తున్న వీడియోల‌ను ఫోటోల‌ను షేర్ చేస్తూ నెట్టింట హల్ చ‌ల్ చేస్తున్నాడు. కాగా ఇప్ప‌డు ఓ హీరోయిన్ తో వ‌ర్మ ప‌బ్ లో సిగ‌రెట్ తాగుతున్నాడు. మ‌ద్యం మ‌త్తులో ఊగిపోతూ ఇన‌యా సుల్తానా అనే న‌టిని ప‌ట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ హీరోయిన్ కూడా వ‌ర్మ‌కు తెగ స‌పోర్ట్ చేస్తోంది. గ‌తంలో కూడా వ‌ర్మ ఇదే హీరోయిన్ తో క‌లిసి స్టెప్పులు వేసిన వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టింది.

ఈ వీడియోను స‌ద‌రు న‌టి కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. వీడియోకు ఇన‌యా సుల్తానా ఆర్జీవి ఎప్పుడూ నా బెస్ట్ డ్యాన్స్ పార్ట‌న‌ర్ అంటూ రాసుకు వ‌చ్చింది. ఇక వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. ఆర్జీవీ ముస‌లాడే కానీ మహానుభావుడు అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.

Ramgopal varma

Ramgopal varma

ఇక మ‌రో నెటిజ‌న్ లైఫ్ ఎంజాయ్ చేస్తే ఆర్జీవీలా చేయాలి అంటూ కామెంట్ చేశాడు. అయితే మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం న‌టీమ‌నులు ఛాన్సుల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవ‌ద్దు అంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఆర్జీవీ తో చిందులు వేస్తే యాంక‌ర్లు, కొత్త‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యేవాళ్లు పాపుల‌ర్ అయిపోవ‌చ్చ‌నే ఇలా చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ALSO READ : అఖండ సినిమాలోని ‘జై బాలయ్య’ పాటకి స్టెప్స్ ఈ సినిమాలో నుంచి కాపీ చేశారట ! నెటిజన్స్ వెతికి మరీ ఇచ్చిపడేసారు !

Visitors Are Also Reading