Home » “పొంగులేటి” చూపు కాంగ్రెస్ వైపు..రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటంటే..?

“పొంగులేటి” చూపు కాంగ్రెస్ వైపు..రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఖమ్మం జిల్లాలోని గట్టి నాయకుడిగా పేరు పొందారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. దాదాపుగా ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ప్రజలు పట్టం కడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మధ్యకాలంలోనే బీఆర్ఎస్ ను వీడారు. దీంతో ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పొంగులేటి బిజెపిలోకి వెళ్తున్నారని ప్రచారం కూడా జరిగింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ పొంగులేటి పై కన్నేశారు. ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన చేరికను భట్టి ఆపుతున్నారని ప్రచారం జరిగింది.

Advertisement

also read:టాలీవుడ్ లో మొదటిసారి 100రోజుల ఫంక్షన్ చేసుకున్న మూవీ..!

Advertisement

దీనికి బట్టి స్పందిస్తూ నేను ఆయన చేరికకు అడ్డు కాదని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని తెలియజేశారు.. దీంతో పొంగులేటి సన్నిహిత నేతలు ఆలోచనలో పడ్డారు. వారి యొక్క అనుచరులతో వరుసగా సమావేశాలు పెడుతూ శ్రీనివాస్ రెడ్డి ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటున్నారు. దీంతో ఎక్కువ మంది అనుచరులు కాంగ్రెస్ లో చేరాలనే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. పొంగులేటి బిజెపిలో చేరుతారని వార్తలు వచ్చిన తరుణంలో ఏ కార్యకర్త కూడా అతని ఆఫీస్ వైపు కూడా వెళ్లలేదట.

కనీసం ఖమ్మంలో ఉనికి లేని బీజేపీలో ఎలా చేరుతారని, తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పొంగులేటితో అన్నట్టు సమాచారం. దీంతో కొంతమంది సన్నిహిత నాయకులు, కాంగ్రెస్ లోకి వెళ్తేనే పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంతో ఆయన బిజెపిలో చేరికపై వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఇదే విషయంపై రేవంత్ రెడ్డి కూడా తెర వెనుక చక్రం తిప్పుతున్నారని, ఎలాగైనా పొంగులేటిని కాంగ్రెస్ లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ లో ఆయన చేరికపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

also read:“మహానటి” మూవీ సావిత్రి కూతురు ఇంట్లో గొడవలు సృష్టించిందా..?

Visitors Are Also Reading