Home » మీ ఇంట్లో ఎలుకల బీభత్సం సృష్టిస్తున్నాయా..? అయితే ఇలా త‌రిమికొట్టండి..!

మీ ఇంట్లో ఎలుకల బీభత్సం సృష్టిస్తున్నాయా..? అయితే ఇలా త‌రిమికొట్టండి..!

by Bunty
Published: Last Updated on
Ad

ఏ ఇంట్లోనైనా ఎలుక ఉందంటే.. ఆ ఇంట్లో వారికి ప్రశాంత‌తే ఉండదు. మరి ఎలుకల్ని సురక్షితంగా బయటకు పంపించ‌డానికి చాలా సింపుల్ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎలుకల్ని చంపడం ఒక‌ పాపం. అవీ మనలాగే జీవించే మూగ జీవాలు. అలాగని వాటిని ఇంట్లో పెట్టుకొని ఉండలేం క‌దా..! ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఒంటరిగా ఉండవు. తమతోపాటూ.. పెద్ద ఫ్యామిలీని వెంట తెస్తాయి. వాటిని బయటకు పంపకపోతే.. అన్నీ కొరికి చిందర వందర చేయడమే కాదు.. అడ్డమైన ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, ఆస్తమా వంటివి వచ్చేలా చేయగలవు. ఎలుకల్ని తరిమేందుకు మార్కెట్‌లో రకరకాల స్ప్రేలు, పెస్టిసైడ్స్ ఉన్నాయి. అవి వాడితే.. వాటిలోని కెమికల్స్ మనకు కూడా హాని చేస్తాయి. అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలుకల్ని ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పుదీనా తైలంతో చిన్న చిన్న దూది ముద్దలను ముంచి తీసి.. ఇంట్లోని వేర్వేరు ప్రదేశాల్లో ఉంచండి. ఎలుకలకు పుదీనా వాసన అస్సలు పడదు. మీ కంట పడకుండా పారిపోతాయి. లవంగాలు మనకు సువాసన ఇచ్చినట్లు అనిపిస్తాయి.. అదే ఎలుకలకు కడుపులో తిప్పుతుంది. అసలు లవంగాల్ని చూస్తే చాలు.. ఎలుకలకు పిచ్చి కోపం వస్తుంది. తమకు బద్ధ శత్రువుల్లా ఫీలవుతాయి. ఎలుకలు వెళ్లే కన్నాల దగ్గర.. చిన్నచిన్న గుడ్డల్లో కొద్దిగా లవంగాల్ని ఉంచండి. అంతే.. ఎలుకలు ఇక ఈ ఇంట్లో ఉండటం మన వల్ల కాదు.. పోదాం పదండి అంటూ బయటకు పోతాయి.

Advertisement

 

మీ ఇంట్లో లెక్కలేనన్ని ఎలుకలు ఉంటే.. ఓ పాత గుడ్డపై కారాన్ని చల్లి.. ఆ గుడ్డను ఓ సంచిలో వేసి.. ఎలుకల రంధ్రాల దగ్గర ఉంచండి. కారం అంటే చాలు ఎలుకలు తట్టుకోలేవు. చెప్పా పెట్టకుండా పారిపోతాయి. ఎలుకలే కాదు చీమలు, బొద్దింకలు, పురుగులకు కూడా కారం అంటే నచ్చదు. ఉల్లిపాయల వాసన కూడా ఎలుకలకు పడదు. అందువల్ల కన్నాల దగ్గర, మూలల్లో ఉల్లిపాయలను ఉంచవచ్చు. ఐతే.. ఎలుకలు అనుకోకుండా ఉల్లిపాయల్ని కొరికితే.. ఆ తర్వాత అవి కుళ్లిపోతాయి. కాబట్టి.. మీరు ఉల్లిని పెట్టాక.. కొన్ని రోజుల తర్వాత వాటిని తప్పనిసరిగా తొలగించాలి. లేదంటే వచ్చే చెడు వాసనతో ఆ ఇంట్లో మీరు ఉండలేరు. ఇన్ని చేసినా ఎలుకలు మొండిగా ఉంటే.. చివరిగా ఈ అస్త్రం పనిచేస్తుంది. తినే సోడా ను ఇంట్లోని ఎలుకలు తిరిగే ప్రాంతాలన్నింటిలో చల్లండి. ఆ రాత్రి అవి ఎలాగూ పారిపోతాయి. అప్పటికీ వెళ్లకపోతే.. తెల్లారే.. తినేసోడాను చీపురుతో అటూ ఇటూ కదపండి. అంతే.. అక్కడి గాలిలో తినేసోడా కలుస్తుంది. ఆ దుమ్మును పీల్చితే చాలు ఎలుకలు.. బాబోయ్.. నాయనోయ్.. అంటూ.. ఎక్కడ లేని పరుగు మొదలుపెడతాయి. ఇలా ఎలుకల్ని వదిలించుకోవచ్చు. ఈ పద్ధతుల ద్వారా ఎలుకలు చనిపోవు. దగ్గర్లోని ఏ పొలాలకో వెళ్లిపోతాయి. తద్వారా మీరు వాటికి హాని చేసినట్లు అవ్వదు.

Visitors Are Also Reading