Home » REPEAT MOVIE REVIEW OTT in Telugu : రిపీట్ మూవీ రివ్యూ.. వారికే నచ్చుతుంది..!

REPEAT MOVIE REVIEW OTT in Telugu : రిపీట్ మూవీ రివ్యూ.. వారికే నచ్చుతుంది..!

by Anji
Ad

Repeat Telugu Movie Review: నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రిపీట్. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా డిసెంబర్ 01న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదల అయింది.  తమిళంలో డెజావు, తెలుగులో రిపీట్ పేరుతో ఒకేసారి ఈ సినిమా రూపొందింది. తమిళంలో గత జూన్ లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో మాత్రం డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన “రిపీట్ ”  ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Repeat Telugu Movie Review

Advertisement

Repeat Telugu Movie OTT: కథ :

సుబ్రహ్మణ్యం (అచ్యుత్ కుమార్) నవల రచయిత. క్రైమ్ నవలలో అతడు ఊహించి రాసిన సంఘటనలు రియల్ లైఫ్ లో జరుగుతుంటాయి. డీజీపీ ఆశా ప్రమోద్ (మధుబాల) కూతురు పూజా కిడ్నాప్ అవుతుంది. సుబ్రహ్మణ్యం కిడ్నాపర్ అనే అనుమానంతో అతనితో పోలీసుల దురుసుగా ప్రవర్తిస్తారు. ఈ సంఘటనలు మీడియాలో హైలెట్ కావడంతో డీజీపీపై విమర్శలు వస్తాయి. దీంతో తన కూతురు కిడ్నాప్ కేసును మీడియాకు తెలియకుండా సైలెంట్ గా సాల్వ్ చేయాలని అండర్ కవర్ ఆఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) సహాయం తీసుకుంటుంది ఆశా ప్రమోద్. పూజను అసలు కిడ్నాప్ చేసింది ఎవరు? డీజీపీ కూతురు కిడ్నాప్ తో రచయిత సుబ్రహ్మణ్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఆశా ప్రమోద్ చేసిన ఓ ఫేక్ ఎన్ కౌంటర్ ని విక్రమ్ ఎలా బయటపెట్టాడు ? జనని అనే అమ్మాయి విషయంలో ఎన్ కౌంటర్ చేయబడిన క్యాబ్ డ్రైవర్ ఎలా బతికి వచ్చాడన్నదే ఈ సినిమా కథ. 

కథనం, విశ్లేషణ  : 

Manam News

Advertisement

జరుగబోయే విషయాలను సుబ్రహ్మణ్యం ముందుగానే ఊహించి తన నవలలో రాయడం, అతను రాసిన నవలలోని క్యారెక్టర్స్ సుబ్రహ్మణ్యాన్ని బెదిరించడం వంటి సీన్స్ తో సినిమా చాలా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఇక డీజీపీ కూతురు కిడ్నాప్ కావడం, ఆ కిడ్నాప్ వెనుక సూత్రధారి సుబ్రహ్మణ్యం అంటూ పోలీసులు అనుమానపడే సన్నివేశాలతో తరువాత ఏం జరుగబోతుందో అని అనుమానపడే టెన్షన్ ని ప్రేక్షకుల్లో క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. నవీన్ చంద్ర ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి సినిమా కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. విక్రమ్ గా నవీన్ చంద్ర చేసే ఇన్వెస్టిగేషన్ సీన్లు చాలా బోరింగ్ ఫీల్ ని కలిగిస్తాయి. 

Also Read :  ‘హనుమాన్’ సినిమాకి గ్రాఫిక్స్ డిజైన్ చేసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Manam News

విక్రమ్ అనే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నవీన్ చంద్ర నటన బాగుంది. డీజీపీగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో మధుబాల అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సుబ్రహ్మణ్యం అనే రైటర్ పాత్రలో ఒదిగిపోయారు. హీరోకి ఇన్వెస్టిగేషన్ లో సహాయపడే పోలీసులుగా సత్యం రాజేష్, పూజా రామచంద్రన్ కనిపించారు.  ఈ చిత్రం ఫస్టార్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నా.. సెకండాఫ్ కి వెళ్లే కొద్ది సినిమా చాలా డల్ అయిపోయింది. పూజా కిడ్నాప్ కేసులోనే ఆశా ప్రమోద్ చేసిన ఓ ఫేక్ ఎన్ కౌంటర్ కి సంబంధించిన ఒక్కో క్లూను రివీల్ కావడం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ అరవింద్ శర్వన్ ట్విస్ట్ ల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. లాజిక్ ని కంప్లీట్ గా మిస్ చేశారు. జిబ్రాన్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. కాకపోతే ఒక మెయిన్ బీజీఎంను ఎక్కువసార్లు రిపీట్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్ గా ఫస్టాప్ మాదిరిగానే సెకండాప్ ఉంటే ఈ సినిమా చాలా బాగుండేది. 

Also Read :  కృష్ణ ఫారెన్ కార్ కొనాలనే కల నెరవేరడం కోసం ఏం చేశారో తెలుసా..?

Visitors Are Also Reading