Home » రవితేజ సినిమాలో రేణూ దేశాయ్….!

రవితేజ సినిమాలో రేణూ దేశాయ్….!

by AJAY
Ad

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రేణుదేశాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. జానీ సినిమా తర్వాత రేణుదేశాయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత రేణుదేశాయ్ బుల్లి తెరపై మెరుస్తున్నారు. ఇప్పటికే టీవీ షో లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇస్తారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Renu deshai raviteja

Advertisement

Advertisement

తాజాగా అలాంటి వార్తలే మరోసారి తెరపైకి వచ్చాయి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సోదరిగా రేణు దేశాయ్ నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Renu deshai raviteja

ఇప్పటికే ఈ సినిమా విషయమై రేణూ దేశాయ్ తో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. రేణూ దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా మరోసారి తెరపై కనిపించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నటీనటుల విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Visitors Are Also Reading