జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అటు టాలీవుడ్ హీరోగా ఇటు ఏపీ రాజకీయ నాయకుడిగా తన వంతు పాత్రను పోషిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో లోతుగా దిగిన తర్వాత… అతని మూడు పెళ్లిళ్ల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
Advertisement
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి ఏపీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారని వైసీపీ నేతలు నిత్యం పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లతో పాటు పార్టీలు మారే అలవాటు కూడా ఉందని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఎంత రియాక్ట్ అయిన.. అది అతనికి మైనస్ అవుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై అతని మొదటి భార్య రేణు దేశాయి సంచలన వీడియో విడుదల చేసింది.
తన మద్దతు పవన్ కళ్యాణ్ కు ఉంటుందంటూ ఈ వీడియో ద్వారా ప్రకటించింది రేణు దేశాయ్. రాజకీయంగా తాను పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన మాజీ భార్య రేణు దేశాయి ఈ వీడియో ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ అసలు డబ్బు మనిషి కాదని… సమాజం మరియు పేదవాళ్లకు మంచి చేయాలని నిత్యం ఆలోచిస్తాడని పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించింది రేణు దేశాయ్. ఇందుకోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టారని వెల్లడించింది. అతని మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి అని కోరింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై, అతని భార్యలు.. పిల్లలపై, సినిమా తీస్తామని కొంతమంది అంటున్నారు… దయచేసి అందులో మా పిల్లలను అస్సలు లాగకండి అని వేడుకుంది రేణు దేశాయ్. తమ పిల్లల్ని కాకుండా ఇతర పిల్లలను కూడా అస్సలు లాగకుండానే వెల్లడించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.