Home » పుష్ప సినిమాలో ఈ సీన్ గుర్తుందా? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు?

పుష్ప సినిమాలో ఈ సీన్ గుర్తుందా? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో పుష్ప సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మరో వైపు అల్లు అర్జున్ రేంజ్ ని కూడా ఇంకో మెట్టుని ఎక్కించింది. ఈ సినిమాలో కూడా చిన్న పొరపాటు ఉంది. సినిమాను సినిమాలనే చూస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పొరపాటు వలన సినిమా కథకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.

pushpa-movie

Advertisement

 

అయితే ఇలాంటి పొరపాట్లని తెలుసుకోవడం కూడా అవసరమే. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవచ్చు. పుష్ప సినిమాలో హీరో మొదటిసారిగా 5 లక్షలు సంపాదించిన తరువాత వాటి పెట్టి ఓ వాన్ కొంటాడన్న సంగతి తెలిసిందే. ఈ ఓమిని వాన్ ఖరీదు సినిమా ప్రకారం పది సంవత్సరాల క్రితం సుమారుగా 1.7 లక్షలు. ఇక రోడ్ వేల్యూ ఒక రెండు లక్షలు ఉంటుంది అనుకున్నా, రిజిస్ట్రేషన్ పనులు అన్ని ముగిసేసరికి మొత్తం ఖర్చు మూడు లక్షలు దాటదు

Advertisement

pushpa

కానీ, అల్లు అర్జున్ ఈ కార్ ని కొనమని చెప్తే, అల్లు అర్జున్ ఫ్రెండ్ కేశవ ఐదు లక్షల పెట్టి ఈ కార్ ని కొనుక్కుని తీసుకొస్తాడు. అసలు దాని ఖరీదు మూడు లక్షలు అయితే, మిగతా రెండు లక్షలు ఏమైనట్లు? ఈ సినిమా మొదటి సారి చూసినప్పుడు ఇలాంటి డౌట్ ఎవరికీ వచ్చి ఉండదు. కానీ, ఈ డౌట్ వచ్చిన తరువాత ఇంత చిన్న లాజిక్ ని సుకుమార్ ఎలా మర్చిపోయారు అని అనిపించక మానదు.

మరిన్ని ముఖ్య వార్తలు:

మెగాస్టార్ అలా చేయడం వల్లే ఆ పవన్ కళ్యాణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందా? అసలు విషయం ఏంటంటే?

Lavanya Tripati : కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా ?

Sapthagiri : రాజకీయాల్లోకి కమెడియన్ సప్తగిరి… చిత్తూరు నుంచి పోటీ !

Visitors Are Also Reading