టాలీవుడ్ పరిశ్రమలో చాలా కాలంగా దర్శక నిర్మాత, నటీనటుల వారసులు ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతున్నారు. టాలీవుడ్ లో ఒకే కుటుంబం నుంచి నటీనటులు పరిచయమయ్యారు. కానీ వాళ్ల మధ్య ఉన్న బంధుత్వాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. అయితే ఇవాళ టాలీవుడ్ లో కొందరు సినీ ప్రముఖుల బంధుత్వాల గురించి తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి : టాలీవుడ్ లో కోట్ల రూపాయల కట్నకానుకలు తీసుకున్న స్టార్ హీరోలు ఇంతమంది ఉన్నారా..?
Advertisement
# నాగార్జున, వెంకటేష్
వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ గారు నాగార్జున గారు మాజీ దంపతులు. వీరి కుమారుడు నాగచైతన్య వెంకటేష్ నాగార్జునలు సొంత బావమరుదులు. కొన్ని కారణాల వల్ల నాగార్జున మొదటి భార్యతో విడాకులు అయినప్పటికీ వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.
# రామ్ పోతినేని, శర్వానంద్
రామ్ పోతినేనికి శర్వానంద్ బావ వరుసవుతాడు. శర్వానంద్ అన్న రామ్ పోతినేని అక్క ఇద్దరు భార్యాభర్తలు.
# సందీప్ కిషన్, చోటా కె నాయుడు
టాలీవుడ్ లో చోటా కె నాయుడు గారి కెమెరా పనితనం గురించి చెప్పనక్కర్లేదు. ఆయన హీరోలని చాలా బాగా చూపిస్తారని పేరు ఉంది. అయితే చోటా కె నాయుడుకి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు. సందీప్ హీరోగా నటించిన చాలా సినిమాలకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా చేశారు.
Advertisement
శ్రీదేవి – మహేశ్వరి
శ్రీదేవి, మహేశ్వరి సిస్టర్ వరుస అవుతారు.
# నగ్మా, జ్యోతిక
ఒకప్పటి అందాల తార నగ్మా, తమిళ్ హీరోయిన్ జ్యోతికలు అక్క చెల్లెలు. జ్యోతిక, నగ్మా కి స్టెప్ సిస్టర్.
# గోపీచంద్, శ్రీకాంత్
తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకాంత్ కి హీరో గోపీచంద్ దగ్గర బంధువే. గోపీచంద్ శ్రీకాంత్ గారి మేనకోడల్ని వివాహం చేసుకున్నాడు.
# కీరవాణి, ఎస్ రాజమౌళి
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి ఇద్దరు అన్నదమ్ములే. కీరవాణి గారి పిన్ని కొడుకు రాజమౌళి. రాజమౌళి గారు తీసిన అన్ని సినిమాలకు సంగీతం అందించారు కీరవాణి గారు.
# ప్రకాష్ రాజ్, శ్రీహరి
ప్రకాష్ రాజ్, శ్రీహరి గారు కలిసి కొన్ని సినిమాలు చేశారు. వీరిద్దరూ తెలుగు సినిమా ప్రేక్షకులు గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేశారు. ప్రకాష్ రాజు గారి మొదటి భార్య, శ్రీహరి గారి భార్య సొంత అక్క చెల్లెలు.
ఇవి కూడా చదవండి : కమెడీయన్ ఆలీకి జగన్ బంపర్ ఆఫర్..అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ !