రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ ఏడాది చిత్రపరిశ్రమకు ఈ లోకానికి దూరమైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోగా రెబల్ స్టార్ గా రానించిన కృష్ణం రాజు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నారు. హీరోగా సినిమాలకు గుడ్ బై చెప్పిన తరవాత తన వారసుడు అయిన ప్రభాస్ హీరోగా నటించిన రెబల్, రాధేశ్యామ్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఎన్టీఆర్ ఎన్ఆర్ ఒక తరం అయితే ఆ తరవాత తరంలో శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ రానించారు.
Advertisement
ఈ ముగ్గురు ఇంచుమించు ఒకే సమయంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఈ ఏడాది కృష్ణం రాజుతో పాటూ కృష్ణ కూడా కన్నుమూయడంతో వారితరం కూడా ముగిసిపోయింది. శోభన్ బాబు హీరోగా నటించిన చేసిన పాపం కాశీకి వెళ్లిన నాటకంలో కృష్ణ సెకండ్ హీరోగా నటించారు. ఆ తరవాత వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లో సైతం నటించారు. ఇదిలా ఉంటే తేనెమనసులు అనే సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ తో పాటూ కృష్ణం రాజు కూడా ఆడిషన్స్ ఇచ్చారట.
Advertisement
కానీ ఆ ఆడిషన్స్ లో కృష్ణకు ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో హీరోగా నటించాడు. అయితే కృష్ణం రాజు కృష్ణల అనుబంధంలో మాత్రం ఏ చిన్న మార్పు రాలేదట. కృష్ణకు సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చినందుకు ఇద్దరూ కలిసి పార్టీ కూడా చేసుకున్నారట. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్ లోనూ మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి.
Advertisement
వీరిద్దరూ హీరోలుగా వచ్చిన యుద్దం సినిమా మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ నుండి కృష్ణం రాజు వరకూ హీరోలు సినిమాలు చేసిన దశకాలను స్వర్ణయుగం అని చెప్పుకునేవారు. ఈ హీరోలు తమ తరవాత తరం హీరోలతోనూ కలిసి నటించి ఫ్యాన్స్ కు కనువిందు చేశారు. అలాంటి లెజెండ్స్ మన మధ్యన లేకపోయినా సినిమాల ద్వారా ఎప్పుడూ బ్రతికే ఉంటారు.