Home » వాల్తేరు వీరయ్యలో చిరు, రవితేజ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అంటే..?

వాల్తేరు వీరయ్యలో చిరు, రవితేజ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అంటే..?

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన గత సినిమా ఆచార్య పెద్ద డిజాస్టర్ గా మిగిలిన… చిరు మాత్రం ఆ విషయం పట్టించుకోకుండా తన కొత్త సినిమాల పై దృష్టి అనేది పెడుతున్నాడు. అయితే ఇప్పుడు చిరు సినిమాల్లో గాడ్ ఫాథర్ ఆలాగే వాల్తేరు వీరయ్య అనే సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. కానీ ఇప్పుడు చిరు సోలో హీరోగా కాకుండా… తన పక్కకు మరో హీరో ఉండేలా చూసుకుంటున్నాడు. అందులో భాగంగా గాడ్ ఫాథర్ లో చిరుతో సల్మాన్ ఖాన్ నటిస్తుంటే.. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ నటిస్తున్నాడు.

Advertisement

అయితే ఈ మధ్యే రవితేజ కూడా వాల్తేరు వీరయ్య షూటింగ్ ప్రారంభించాడు. అయితే గతంలో వీరిద్దరూ అన్నయ అనే సినిమాలో అన్న తమ్ముడిగా కనిపించారు. అందుకే ఇప్పుడు ఈ విధంగా కనిపించబోతున్నారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్యలో చిరు, రవితేజ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది బయటకు వచ్చింది. ఈ సినిమాల్లో వీరు ఇద్దరు అన్న, తమ్ముడి గానే కనిపించబోతున్నారు. కానీ ఇందులో వీరికి ఒక్కే తండ్రి కానీ తల్లులు వేరు అంట. అంటే చిరు తండ్రి యొక్క రెండో భార్య కొడుకుగా రవితేజ నటించబోతున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

అదే విధంగా ఈ సినిమాలో చిరంజీవి ఓ దొంగ పాత్రలో కనిపించనున్నాడు అని.. అతనికి ఇందులో ఓ కూతురు కూడా ఉంటుంది అని తెలుస్తుంది. ఇక ఆయా దొంగను పట్టుకునే పోలీస్ పాత్రలో రవితేజ నటించబోతున్నాడు అని సమాచారం. కానీ ఇందులో రవితేజ పాత్ర అనేది… ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర మాదిరే సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇవాలనున్నట్లు తెలుస్తుంది. కానీ ఆయా పాత్ర అనేది ఎంత సమయం ఉంటుంది అనే విషయం మాత్రం తెలియడం లేదు. మరి ఇందులో ఎంత నిజం అనేది సినిమా విడుదల అయ్యాకే తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

రోహిత్ కంటే దినేష్ గ్రేట్.. ఎలా అంటే..?

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన విరాట్ కోహ్లీ..!

Visitors Are Also Reading