Telugu News » Blog » SBI బ్యాంక్‌ లో రెగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు..2 రోజులు మాత్రమే ఛాన్స్..త్వరపడండి !

SBI బ్యాంక్‌ లో రెగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు..2 రోజులు మాత్రమే ఛాన్స్..త్వరపడండి !

by Bunty
Ads

బ్యాంక్‌ లో ఉద్యోగం అంటే ఎవరికీ ఇష్టం ఉండదండి. బ్యాంక్‌ లో ఉద్యోగం అంటే నెలలో పక్కాగా 6 సెలవులు ఉంటాయి. దీంతో చాలా మంది ఈ ఉద్యోగాలకు ఆసక్టి చూపుతారు. అయితే, బ్యాంక్‌ లో జాబ్‌ కొట్టాలను కునే వారికి SBI శుభవార్త చెప్పింది. SBI పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం SBI లో 54 ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ sbi.co.inనీ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 29 డిసెంబర్ 2022. SBI నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద, 54 పోస్టులను రిక్రూట్ చేస్తారు.ఇందులో రెగ్యులర్ మరియు కాంట్రాక్టు పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద, రెగ్యులర్ స్థానాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో హాజరు కావాలి. అదే సమయంలో, కాంట్రాక్ట్ పోస్ట్ పై అభ్యర్థుల నియామకం కోసం, వారు ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు. అభ్యర్థులు డిగ్రీ, పిజీతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, EWS, OBC కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి. SC, ST, PWD కేటగిరి అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా sbi.co.in/web/careers అధికారిక సైట్ ని సందర్శించి, హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. అభ్యర్థులు “ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి” లింకుపై క్లిక్ చేసి, అభ్యర్థులు పేరు, ఫోన్ నెంబర్ తో పాటు ఇతర వివరాలను నమోదు చేసుకోవాలి.

Advertisement

READ ALSO : పదో తరగతి పాసైన వారికి గుడ్‌ న్యూస్‌..తెలంగాణలో రేషన్‌ డీలర్‌ ఉద్యోగాలు..!

You may also like