శరీరంలో తగినంత స్థాయిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండడం అనేది చాలా ముఖ్యం. హార్మోన్ల ఉత్పత్తికి, సెల్ గోడలను ఫ్లెక్సిబుల్ గా ఉంచడంలో కొలెస్ట్రాల్ దోహదపడుతుంది. ఇక ఇదే సమయంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితె గుండె జబ్బులు, మూత్రపిండాల వంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన జీవన శఐలిలో వస్తున్న మార్పులు కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తే అవకాశముంది. కొలెస్ట్రాల్ లైపో ప్రోటీన్ల కలయికతో ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణను నిరోధిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రించడానికి హెచ్ డీ ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం చాలా అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా కొలెస్ట్రాల్ నియంత్రించడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : భార్య భర్తను పేరు పెట్టి పిలిస్తే.. ఇంత ప్రమాదమా…?
Advertisement
Advertisement
- వ్యాయామం శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. తేలికపాటి వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ ప్రమాదం నుంచి నుంచి కాపాడుతాయి.
- సోయాబీన్స్, బఠానీలు, కాయ ధాన్యాలు, పండ్లు, ఇతర తృణధాన్యాలు కరిగే ఫైబర్ కి మూలాలు. వాటిని తీసుకోవడం వల్ల శరీరం నుంచి ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ని తొలగించడంలో సహాయపడే బ్యాక్టీరియా ప్రోబయోటిక్ కి సహాయపడుతుంది.
- అలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, ట్రీనట్స్, అవకాడోస్ వంటి మోనో శాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి దోహదపడుతుంది.
- బరువు తగ్గడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్ డీఎల్ పెరుగుతుంది.
- ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. అదే సమయంలో హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ చిట్కాల వల్ల కొలెస్ట్రాల్ స్థాయి బ్యాలెన్స్ చేసుకునేందుకు వీలుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ప్రయత్నించండి.
Also Read : 2022లో ఎక్కువగా వెతికిన మూలికలు ఇవే..!