Home » బంగారాన్ని క్రాస్ చేసిన ఎర్ర బంగారం.. ఎనుమామూల మార్కెట్‌లో ధ‌ర ఎంతంటే..?

బంగారాన్ని క్రాస్ చేసిన ఎర్ర బంగారం.. ఎనుమామూల మార్కెట్‌లో ధ‌ర ఎంతంటే..?

by Anji
Ad

బంగారం ధ‌ర‌ను క్రాస్ చేసింది ఎర్ర బంగారం (మిర్చి). ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌త్యేకంగా పండించే దేశీ రకం మిర్చికి ఆల్‌టైమ్ రికార్డు ధ‌ర ప‌లికింది. ఆసియాలోనే అతిపెద్ద వ్య‌వ‌సాయ మార్కెట్‌లో ఒక‌టైన ఎనుమాముల మార్కెట్‌లో ఈ దేశీ ర‌కం మిర్చికి క్వింటాల్‌కు రూ.55,551 ల‌భించింది. ఒక తులం బంగారం ధ‌ర 52,140 ఉండ‌గా.. బంగారం కంటే క్వింటాల్ దేశీ ర‌కం మిర్చికి ఎక్కువ ధ‌ర ప‌ల‌క‌డం విశేషం.

Advertisement

ఎనుమాముల మార్కెట్ ప్రారంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇదే హ‌య్య‌స్ట్ ధ‌ర కావ‌డంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. దేశంలో ఎక్క‌డ మిర్చికి ఈ ధ‌ర లేద‌ని చెబుతున్నారు. దీనిని బ‌ట్టి మిర్చికి డిమాండ్ ఎలా పెరిగింది. ధ‌ర‌లు ఎలా ఎగ‌బాకుతున్నాయో అర్థం అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎనుమాముల మార్కెట్‌లో ప‌లికిన గ‌రిష్ట ధ‌ర క్వింటాల్ కు 21వేల రూపాయ‌లు మాత్ర‌మే. ఇప్పుడు రెండున్న‌ర రెట్లు పెరిగి రికార్డులు బ్రేక్ చేసింది.

Advertisement


దేశీ ర‌కం మిర్చి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మాత్ర‌మే సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎర్ర‌మ‌ట్టి నేల‌ల్లోనే ఈ పంట పండుతుంది. ఈ పంట‌ను సాగుచేయ‌డం క‌త్తిమీద సాము లాంటిదే. ఎక‌రానికి ల‌క్ష‌రూపాయ‌లు పెట్టుబ‌డి అవుతుంది. మిర్చి తోట‌ల‌ను ప‌సిపిల్ల‌ల‌ను సాకిన‌ట్టు కంటికి రెప్ప‌లా కాపాడాలి. గ‌ట్టిగా ఒక్క‌వాన ప‌డితే తుడిచి పెట్టుకుపోయే ప్ర‌మాదం పొంచి ఉంది. ఈసారి కూడా పంట చేతికి వ‌చ్చే స‌మ‌యంలో అకాల వ‌ర్షం వ‌ల్ల చాలా మంది రైతులు న‌ష్ట‌పోయారు. దిగుబ‌డి పోయింది. దీంతో ధ‌ర కూడా రికార్డు స్థాయిలో ప‌లికింది. న‌ష్టాల గ‌ట్టెక్కుతామ‌ని కొంద‌రూ రైతులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఎర్ర‌నేల‌ల్లో పండే ఎర్ర బంగారం ఆల్‌టైమ్ రికార్డు ధ‌రతో అంద‌రి దృష్టికి ఆక‌ర్షిస్తోంద‌నే చెప్ప‌వ‌చ్చు.

Also Read :  చెన్నై కెప్టెన్ ఇప్ప‌టికీ ధోనియే.. హ‌ర్భ‌జ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Visitors Are Also Reading