Home » రామ్ చరణ్ మంచు విష్ణులకు మాత్రమే ఈ రికార్డు సాధ్యం.. ఏంటంటే..?

రామ్ చరణ్ మంచు విష్ణులకు మాత్రమే ఈ రికార్డు సాధ్యం.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలలో తండ్రుల నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోలుగా కొనసాగుతున్నారు రామ్ చరణ్ మంచు విష్ణు. అలాంటి ఈ ఇద్దరు హీరోల పేరిట ఒక రికార్డు ఉంది.. ప్రస్తుత జనరేషన్ హీరోలలో ఈ రికార్డు ఎవరికి కూడా సాధ్యం కాలేదు. మరి వీరిద్దరి పేరిట ఉన్న ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి రానిస్తున్నాడు.

అంతేకాదు మంచు విష్ణు కూడా మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మా అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇక రామ్ చరణ్ గత సంవత్సరం రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఘనవిజయం అందుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇక మంచు విష్ణు హీరోగా మళ్లీ సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇక రాంచరణ్ హీరో గానే కాకుండా నిర్మాతగా తన ఇంటి మీద కొణిదల ప్రొడక్షన్ మొదలుపెట్టి తన తండ్రి మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150 తెరకెక్కించారు..

అలాగే మంచు విష్ణు కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. ఈయన కూడా తన తండ్రి మోహన్ బాబు హీరోగా సన్నాఫ్ ఇండియా సినిమా తెరకెక్కించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలు తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్ ఆచార్య చిత్రంలో పూర్తిస్థాయిలో తండ్రితో తెరను పంచుకున్నారు.ఈ విధంగా నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే విధంగా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మంచు విష్ణు.

also read:

Visitors Are Also Reading