Telugu News » Blog » రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్ చెల్లికి చేదు అనుభ‌వం.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్ చెల్లికి చేదు అనుభ‌వం.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

by Anji
Ads

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి తెలియ‌ని వారు ఎవ‌రు ఉండ‌రు. ముఖ్యంగా బాహుబ‌లి సినిమా త‌రువాత దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందారు ప్ర‌భాస్‌. ఆయ‌న‌కు ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు ప్ర‌సీద‌. ఆమె కూడా నిర్మాత‌గా మారారు. ఇక రాధేశ్యామ్ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా ప్ర‌భాస్‌కు ఓ సోద‌రుడు ప్ర‌బోధ్ కూడా ఉన్నారు. ఈశ్వ‌ర్ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ప్ర‌భాస్‌.. తండ్రి సూర్య‌నారాయ‌ణ రాజు, త‌ల్లి శివ‌కుమారి. ప్ర‌భాస్ ఒక్కొక్క సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారారు. వ‌రుస హిట్ సినిమాల‌తో ఇండ‌స్ట్రీనే షేక్ చేస్తున్నారు. ప్ర‌తి సినిమాలో త‌న పాత్రలో కొత్త‌ద‌నం ఉండేవిధంగా జాగ్ర‌త్త ప‌డుతున్నారు.


ఇక అంద‌రి గుండెల్లో డార్లింగ్‌గా నిలిచి పోయారు. ప్ర‌భాస్ వాళ్ల‌ది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరు. అది చిరంజీవి ఊరు కూడా ఒకటే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ప్ర‌భాస్ చెల్లి ప్ర‌సీద ఇటీవ‌ల ఓ ఫుడ్ సంస్థ‌పై కామెంట్లు చేసింది. స్విగ్లీ అనే సంస్థ అందించే ఫుడ్ బాలేద‌ని.. స‌మ‌యానికి వారు అందించర‌ని పేర్కొంది. వారి సేవ‌లు సరిగ్గా లేక‌పోవ‌డంతో తాము వేరే యాప్ చూసుకుంటామ‌ని కూడా చెప్పుకొచ్చింది. స్విగ్లీ నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌ని విమ‌ర్శ‌లు చేసింది. దీనిపై స్విగ్లీ వారు స్పందించారు. మీ ఐడీ నెంబ‌ర్ పంపాల‌ని సూచించారు. మీరే క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని.. స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని పోస్ట్ చేసారు. దీంతో ఆమె ఇది ఒక చెత్త అనుభ‌వం అని కామెంట్ చేసింది.


ప్ర‌సీద‌కు చేదు అనుభ‌వం ఎదురైన‌ట్టయింది. అది ఒక చెత్త పోస్టింగ్‌గా అభివ‌ర్ణించారు. ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజుకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇక రెబ‌ల్ స్టార్ బిరుదు ఆయ‌న‌దే. ఆ త‌రువాత కాలంలో ప్ర‌భాస్ పెట్టారు. చిత్ర‌సీమలో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు ప్ర‌భాస్‌. ఆయ‌న న‌టించిన బాహుబ‌లి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది. ఎన్నో మైలు రాళ్లు దాటుకొని త‌న ప్ర‌యాణంలో ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా వెనుదిర‌గ‌క‌ముందే న‌డుస్తున్న న‌టుడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం స‌లార్ సినిమాలో న‌టిస్తున్నాడు. కేజీఎఫ్‌-2 ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. నిన్న ప్ర‌శాంత్ నీల్ పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌భాస్‌, కేజీఎఫ్‌-2 హీరో య‌శ్ ఇద్ద‌రూ బెంగ‌ళూరు వెళ్లి అక్క‌డ పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Also Read :

“యముడికి మొగుడు” సినిమా ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో తెలుసా…? ఈ సినిమాతో సుధాకర్ కు ఉన్న సంబంధం ఏంటంటే..!

చిరంజీవి నాజ‌ర్ ను ఎందుకు చంపేస్తాన‌ని బెదిరించాడు..? అలా ఎందుకు చెప్పాడు..!


You may also like