Telugu News » Blog » కాంతారా సినిమా పై రెబల్ స్టార్ ప్రభాస్ రివ్యూ.. సినిమా ఎలా ఉదంటే..?

కాంతారా సినిమా పై రెబల్ స్టార్ ప్రభాస్ రివ్యూ.. సినిమా ఎలా ఉదంటే..?

by Anji
Ads

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం కాంతారా. ఈ సినిమా సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అతి తక్కువ సమయంలోనే భారీగా వసూళ్లు సాధించి కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను రికార్డులను చెరిపివేసింది. కేజీఎఫ్ లాంటి సంచలనాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కర్ణాటకలో అతిపెద్ద విజయం సాధించడంతో ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు.

Advertisement

Also Read : Kantara Movie Review :”కాంతార” మూవీ రివ్యూ.. రేటింగ్.. క్లైమాక్స్ అదిరిపోలా..!!


తాజాగా తెలుగులో కూడా విడుదల అయింది. ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాను చూసిన ప్రభాస్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్ చేశాడు. ఈ చిత్రం తనను చాలా ఇంప్రెస్ చేసిందని, అందుకే కాంతారా సినిమాను రెండు సార్లు చూసినట్టు తెలిపారు. ఈ సినిమా ద్వారా ప్రత్యేక కాన్సెప్ట్ తెలియజేశారని ప్రశంసించారు ప్రభాస్.

Advertisement

Also Read : జయలలితకి ,శోభన్ బాబుకు లవ్..చివరికి పెళ్లి చేసుకోమంటే బాబు ఇలా అన్నారా..?


కాంతారా సినిమా వాస్తవానికి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అదేవిధంగా థ్రిల్లింగ్ క్లైమాక్స్. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలి అని రాసుకొచ్చారు. మరోవైపు ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ చిత్రాన్ని కూడా హోంబలే ఫిల్మ్ నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రకాశ్ తుమినాడ్, ప్రమోద్ శెట్టి, నవీన్ డి పాడిల్ కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో అక్టోబర్ 20న విడుదల కానుంది. హిందీలో అక్టోబర్ 14న విడుదల అయింది. తెలుగులో అక్టోబర్ 15న విడుదల అయింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడం విశేషం.

Advertisement

Also Read : నయనతార దంపుతులు భలే ప్లాన్ చేసారు ..! సరోగసి కేసు నుంచి తప్పించుకునేందుకు …!