Home » మార్వాడీలు వ్యాపారంలో స‌క్సెస్ అవ్వ‌డానికి అస‌లైన‌ కార‌ణాలు ఇవేన‌ట‌…!

మార్వాడీలు వ్యాపారంలో స‌క్సెస్ అవ్వ‌డానికి అస‌లైన‌ కార‌ణాలు ఇవేన‌ట‌…!

by AJAY
Ad

వ్యాపారంలో మార్వాడీల‌ను మించిన వాళ్లు లేర‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇత‌ర రాష్ట్రాల నుండి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఏ ప్రాంతంలో అయినా వ్యాపారాన్ని ప్రారంభించి స‌క్సెస్ అవుతారు. ఇది అది అనే తేడా లేకుండా ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో మార్వాడీలు స‌క్సెస్ అవుతారు. అయితే అలా మార్వాడీలు బిజినెస్ లో స‌క్సెస్ అవ్వ‌డానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం….మార్వాడీలు ప్ర‌తిరోజూ ఖ‌చ్చితంగా ల‌క్షిదేవిని పూజిస్తారు.

Advertisement

కుటుంబం మొత్తం క‌లిసి ల‌క్ష్మి దేవికి పూజ చేస్తారు. ఇత‌రులు కూడా ల‌క్షీదేవిని పూజించిన‌ప్ప‌టికీ మార్వాడీలు మాత్రం ఉద‌యాన్నే నైవేద్యం త‌యారు చేసి కుటుంబమంతా క‌లిసి పూజిస్తారు. మార్వాడీలో ప్ర‌తిరోజూ పాల‌తో ఏదో ఒక స్వీట్ చేస్తారు. పాల‌తో చేసిన స్వీట్ ను ల‌క్ష్మి దేవికి పెట్ట‌డం ద్వారా దేవీ క‌టాక్షం ఉంటుంద‌ని న‌మ్ముతారు.

Advertisement

ఇక రాత్రి స‌మ‌యంలో కిచెన్ ను కూడా మార్వాడీలు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటారు. అలా చేయ‌డం వ‌ల్ల ఇల్లు కూడా ప‌రిశుభ్రంగా ఉంటుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మాంస‌హారాన్ని మార్వాడీలు తిన‌రు. పాలు బెల్లాన్ని మార్వాడీలు ఎక్కువ‌గా వాడుతుంటారు. అంతే కాకుండా ఎంత సంపాదించినా గర్వంతో క‌నిపించ‌రు.

ఎవ‌రితో అయినా చాలా సాఫ్ట్ గా మాట్లాడుతుంటారు. ఇంటిని ఎప్పుడూ సువాస‌న వ‌చ్చేలా అలంక‌రించుకుంటారు. మాట తీరు ద్వారా ప్ర‌వ‌ర్త‌న ద్వారా కూడా డ‌బ్బులు వ‌స్తాయ‌ని మార్వాడీలు న‌మ్ముతారు. కాబ‌ట్టి చాలా కూల్ గా మాట్లాడుతుంటారు. ఇక వీటితో పాటూ మార్వాడీలు ఏ వ్యాపారం చేసినా చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. వ్యాపారంలో ప్ర‌తి ఖ‌ర్చుకు లెక్క రాసుకుంటారు.

Visitors Are Also Reading