Home » ఆంజ‌నేయ‌స్వామిని ఆడ‌వారు ఎందుకు తాక‌కూడ‌దో తెలుసా..?

ఆంజ‌నేయ‌స్వామిని ఆడ‌వారు ఎందుకు తాక‌కూడ‌దో తెలుసా..?

by Anji
Published: Last Updated on

ఆంజ‌నేయ‌స్వామి గుడి లేని ఊరు ఉండ‌డం చాలా అరుదుగా ఉంటుంది. రామాయ‌ణంలో రామునికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్య‌త హ‌నుమంతుడికీ ఉంటుంది. హ‌నుమాన్ అంజ‌నాదేవి, కేస‌రిల సుతుడు. కోరిన కోరిక‌ల‌ను తీర్చుతాడు అంజ‌న్న‌. భ‌క్తులు ముఖ్యంగా పువ్వులు, ప‌త్రాల‌తో పూజించ‌గానే కొండంత అండ‌గా నిలుస్తాడు. ఆంజ‌నేయ‌స్వామికి ఎక్కువ‌గా త‌మ‌ల‌పాకులు అంటే ఇష్ట‌మ‌ట‌. ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనైనా ధైర్యాన్ని ఇస్తాడు. ఎక్క‌డ రామ‌నామం వినిపిస్తుందో అక్క‌డ ఆంజ‌నేయ‌స్వామి ప్ర‌త్య‌క్షం అవుతాడు. భ‌క్తుల విశ్వాసం ఎక్క‌డ హ‌నుమ ఉంటారో అక్క‌డ శ్రీ‌రామ చంద్రుల వారు కూడా త‌ప్ప‌కుండా ఉంటారు.

Also Read: చ‌మ్మ‌క్ంద్ర‌ను జ‌బ‌ర్ద‌స్త్‌కు రాకుండా అడ్డుకున్న‌ది ఎవ‌రో తెలుసా..?

Kondagattu: The Hanuman Jayanthi Celebrations Will Be Held Without Devotees

శ్రీ‌రాముని పేరు విన‌గానే మ‌న‌కు హ‌నుమంతుడు త‌ప్ప‌క గుర్తుకు వ‌స్తారు. సీతారాముల దాసునిగా, రామ‌భ‌క్తుడిగా విజ‌య ప్ర‌దాత‌గా, ర‌క్ష‌కునిగా హిందూమ‌తంలో అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో కొలువ‌బ‌డే దేవుడు. ముఖ్యంగా హ‌నుమాన్‌, ఆంజ‌నేయుడు, బ‌జ‌రంగ‌బ‌లి, మారుతి, అంజ‌నిసుతుడు వంటి పేర్ల‌తో హ‌నుమంతున్ని ఆరాధిస్తారు. నుమంతున్ని పూజించే విష‌యంలో క‌చ్చితంగా కొన్ని ఆచారాలున్నాయి. ముఖ్యంగా ప్ర‌ద‌క్షిణ‌లు చేసేట‌ప్పుడు కూడా కొన్ని నియ‌మాలు పాటించాలి. అన్ని దేవాల‌యాల్లో మూడు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటాం. కానీ ఆంజనేయ‌స్వామి ఆల‌యంలో క‌చ్చితంగా ఐదు ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి. ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటాం. ప్ర‌ద‌క్షిణ‌లు చేసే స‌మ‌యంలో హ‌నుమాన్ జ‌య హ‌నుమాన్ జ‌య జ‌య హ‌నుమాన్ అని చ‌ద‌వ‌డం మంచిది. స‌క‌ల రోగ‌, భూత‌ప్రేత పిశాచాది బాధ‌లు తొల‌గించ‌డంలో ఆంజ‌నేయ‌స్వామి ముందు ఉంటాడు. భ‌క్తులు ఏ బాధ‌లో ఉన్నా కూడా ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే బాధ‌ల‌న్నీ తొలగిపోతాయి.

ఆంజనేయ స్వామి మహాత్యం: హుంకార మంత్రం మహిమ | Anjaneya Swamy mahatyam - Telugu Oneindia

కొంత మంది ఒకేరోజు 108 సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటారు. అలా చేయ‌లేని వారు 54, లేదా 27 ప‌ర్యాయాలు చేసినా మంచిదే. అయితే లెక్క త‌ప్ప‌కుండా చేయాలి. అదేవిధంగా ఆంజ‌నేయ‌స్వామి పాదాల వ‌ద్ద అస్స‌లు తాక‌కూడ‌దు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాల‌ను పాదాక్రాంతం చేసుకున్నాడు అని అందుకు పాదాల‌ను తాక‌కూడ‌దు అని చెప్తారు. భ‌క్తులు హ‌నుమంతుడికి ఏమి స‌మ‌ర్పించాల‌న్నా పూజారిగారి చేతుల మీదుగానే స‌మ‌ర్పించాలి. ఆడ‌వారు అస్స‌లు హ‌నుమంతున్ని తాక‌కూడ‌దు అని పేర్కొంటారు. ఎందుకంటే అంజ‌నీ సుతుడు బ్ర‌హ్మ‌చారంలో ఉంటాడు కాబ‌ట్టి ఆడ‌వారు ఆంజ‌నేయ‌స్వామికి ఆమ‌డ దూరంలో ఉండి త‌మ మొక్కుల‌ను చెల్లించుకోవ‌డం మంచిది.

Visitors Are Also Reading