Home » నందమూరి బాలకృష్ణ వారసుడు ‘మోక్షజ్ఞ’ ఎందుకు టాలీవుడ్ ఎంట్రీ కి ఆలస్యం అవుతుంది ? తెరవెనుక కారణం ఇదే !

నందమూరి బాలకృష్ణ వారసుడు ‘మోక్షజ్ఞ’ ఎందుకు టాలీవుడ్ ఎంట్రీ కి ఆలస్యం అవుతుంది ? తెరవెనుక కారణం ఇదే !

by AJAY
Ad

నాగార్జున, చిరంజీవి, మోహ‌న్ బాబు, నంద‌మూరి హ‌రికృష్ణ‌ ఇలా ఒక‌ప్పిటి స్టార్ హీరోల వార‌సులు అంతా ఇప్పటికే టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యారు. కానీ బాల‌య్య కుమారుడు మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వ‌లేదు. టాలీవుడ్ లో బాల‌య్య కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. బాల‌య్య ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బాల‌య్య సినిమా వ‌చ్చిందంటే కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్న ఆయ‌న అభిమానులు కూడా పండ‌గ చేసుకుంటారు.

ఇక ఇప్పుడు బాల‌య్య ఫ్యాన్స్ ఆయ‌న త‌న‌యుడు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం వేయి కండ్ల‌తో వేచి చూస్తున్నారు. అయితే మూడేళ్లు గా మోక్షాజ్ఞ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు అంటూ వార్త‌లు వినిపిస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ప్ర‌స్తుతం మోక్షాజ్ఞ అమెరికాలో న‌ట‌న‌లో మెల‌కువ‌లు నేర్చుకుంటున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మోక్షాజ్ఞ ఎంట్రీ ఆల‌స్యం అవ్వ‌డానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Advertisement

Advertisement

mokshagna

mokshagna

మోక్షాజ్ఞ జాతకం వ‌ల్ల‌నే అత‌డి ఎంట్రీ ఆల‌స్యం అవుతుందని టాక్. బాల‌య్య సాధార‌ణంగా ముహూర్తాల‌ను మ‌రియు జాత‌కాల‌ను ఎక్కువగా న‌మ్ముతార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తండ్రి ఎన్టీరామారావు వ‌ల్ల బాల‌య్యకు కూడా జాత‌కాల‌ను ఎక్కువ‌గా విశ్వ‌సించ‌డం అల‌వాట‌య్యింది.

సినిమాను మొదలు పెట్టాల‌న్నా…ఆ సినిమాను విడుద‌ల చేయాల‌న్నా బాల‌య్య క‌చ్చితంగా ముమూర్తం చూపిస్తార‌ట‌. అలాంటిది త‌న త‌న‌యుడిని ప‌రిచయం చేయ‌డం విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటారో ప్ర‌త్య‌కంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. మోక్షాజ్ఞ జాతకం ప్ర‌కారం 2023 లో ఎంట్రీ ఇస్తే స‌క్సెస్ అవుతాడ‌ని తెలిసింద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మోక్షాజ్ఞ‌ను ప‌రిచ‌యం చేసి ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ALSO READ : “కృష్ణ వ్రిందా విహారి” రివ్యూ !

Visitors Are Also Reading