Home » సాయి పల్లవి సినిమాల వరుస ప్లాపులకు కారణం ఏంటో తెలుసా…?

సాయి పల్లవి సినిమాల వరుస ప్లాపులకు కారణం ఏంటో తెలుసా…?

by Azhar
Ad

టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ అందులో సాయి పల్లవి మాత్రం ప్రత్యేకం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. అయితే మన తెలుగులోకి వచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ గా మారిపోయింది సాయి పల్లవి. ఆమె వద్దకు అవకాశాలు అనేవి చాలా వచ్చాయి. కానీ మిగితావారిలాగా వచ్చిన అన్ని అవకాశాలకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాగే రెమ్యునరేషన్ చూసి కూడా సాయి పల్లవి ఒప్పుకోలేదు. సాయి పల్లవి ఒక్క సినిమాను ఒప్పుకోవాలంటే.. తన పాత్రకు గట్టి బేస్ అనేది ఉండాలి.

Advertisement

అందుకే తనకు బలమైన రోల్ ఉన్న సినిమాలనే ఈ మధ్య సాయి పల్లవి చేస్తుంది. అందులో భాగంగానే వచ్చిన విరాట పర్వం, గార్గి రెండు సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. ఇందులో సాయి పల్లవి నటనకు మాంచి మార్కులుఈ వచ్చినా కూడా ఈ రెండు సినిమాలు అనేవి ప్లాప్ అయ్యాయి. అయితే ఇలా సాయి పల్లవి సినిమాల వరుస ప్లాపులకు కారణం ఏంటి అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే సాయి పల్లవి నటన అంటే అందరికి ఇష్టమే. కానీ ఇలా వరుసగా ఒక్కే రకమైన పాత్రలో ఆమె చేయడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

Advertisement

ఒక్కే పాత్రలో సాయి పల్లవిని ఫ్యాన్స్ చూడలేకపోతున్నారు… అందుకే ఆమె సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇదే విషయం కొంతమంది సాయి పల్లవికి కూడా చెప్పారట. కానీ నేను నానా నిర్ణయం అనేది మార్చుకోను అని సాయి పల్లవి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఎప్పుడు ఇలా సీరియస్ రోల్ లోనే కాకుండా అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటది అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. అలాగే ఈ సీరియస్ రోల్ సినిమాల్లో సాయి పల్లవి డ్యాన్స్ కూడా చాలామంది అభిమానులు మిస్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఈ ఫోటోలో షెఫాలీ వర్మను నాట్ ఔట్ గా ఇచ్చారు.. ఎందుకంటే..?

కెప్టెన్ల కంటే ఎక్కువ ఓపెనర్లను మారుస్తున్న టీం ఇండియా… ఎందుకు..?

Visitors Are Also Reading