Home » ఆదిపురుష్ లో రావణుని లుక్ వెనుక కథ ఇదే..!

ఆదిపురుష్ లో రావణుని లుక్ వెనుక కథ ఇదే..!

by Azhar
Ad
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ఆదిపురుష్. అయితే రాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో రావణాసురుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే ఈ మధ్యే ఈ సినిమా యొక్క టీజర్ అనేది విడుదల అయ్యింది. కానీ అది ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చలేదు.
ఆదిపురుష్ టీజర్ పై విపరీతమైన ట్రోలింగ్ అనేది జరిగింది. అలాగే దర్శకుడు ఓం రౌత్ ను కూడా సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రావణసురుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్ అనేది చాలా ట్రోలింగ్ కు గురైంది. అది ఓ టెర్రరిస్ట్ లుక్ అంటూ కామెంట్స్ చేసారు. కానీ తాజాగా రావణుడికి ఈ లుక్ అనేది ఇవ్వడంపై దర్శకుడు ఓం రౌత్ క్లారిటీ అనేది ఇచ్చాడు.
ఓం రౌత్ మాట్లాడుతూ.. రావణుడు ఓ క్రూరుడు అని చెప్పడానికే మేము ఈ తరహా లుక్ అనేది అతనికి ఇచ్చాము అని ఓం రౌత్ అన్నారు. అతని క్రూరమైన వ్యక్తిత్వాన్ని చూపించడానికే గతంలో రామాయణం పైన వచ్చిన సినిమాలో రావణుడిగా భారీ ఆకారాల్లో చూపించారు. అందుకే మేము ఇలా చూపించాం. ఇక అతను ఓ పెద్ద పక్షి పైన ఎగురుతూ వెళ్లడం కూడా అందులో భాగమే అని ఓం రౌత్ తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading