Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » సినిమాలు ప్లాప్ అవుతున్న భయపడని రవితేజ నిర్మాతలు..!

సినిమాలు ప్లాప్ అవుతున్న భయపడని రవితేజ నిర్మాతలు..!

by Azhar
Ads

మాస మహారాజ రవితేజ ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో ఒక్కడు. కానీ ఈ మధ్యే ఈయనకు సరైన హిట్ అనేది లేదు. ఎప్పుడెప్పుడో క్రాక్ అనే సినిమాతో హిట్ అందుకున్న రవితేజ.. ఆ తర్వాత విడుదల చేసిన అన్ని సినిమాలు కూడా ప్లాప్ గానే నిలిచాయి. దాంతో హిట్ సినిమా కోసం రవితేజ తెగ ప్రయత్నాలు అనేవి చేస్తున్నాడు.వరుసగా మూడు ప్లాప్ లు ఇచ్చిన తర్వాత కూడా రవితేజ ఇంకా మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి అంటేనే ఈ విషయం అర్ధం అవుతుంది.

Advertisement

Ad

అయితే ఇలా రవితేజ సినిమాలు అనేవి వరుసగా ప్లాప్ అవుతున్నా కూడా ఆయన నిర్మాతలు మాత్రం భయపడటం లేదు అని తెలుస్తుంది. సినిమాలు తీసిన వారే కాకుండా ఇంకా కొత్త నిర్మాతలు కూడా రవితేజతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే రవితేజతో సినిమా చేస్తే మేము నష్టపోము అని నిర్మాతలు నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా రవితేజ సినిమాలు అన్ని 50 కోట్ల లోపే పూర్తవుతాయి అనేది అందరికి తెలుసు.

అలాగే రవితేజ సినిమా అంటే థియేటర్ లో హిట్, ప్లాప్ అనేది లేకుండా టీవీలో జనాలు తెగ చూస్తారు. అందుకే రవితేజ ప్లాప్ సినిమా అయినా కూడా ఓటీటీ అలాగే సాటిలైట్ రైట్స్ అనేవి మంచి ధరకే అమ్ముడుపోతాయి. ఈ కారణంగానే రవితేజతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు అని తెలుస్తుంది.

Advertisement

ఇవి కూడా చదవండి :

టెండూల్కర్ సారాను వదిలేసి ఖాన్ సారాను పట్టుకున్న గిల్..!

గత ఏడాది కోహ్లీ చేసిన తప్పే.. ఇప్పుడు బాబర్ చేశాడా..?

Visitors Are Also Reading