Home » ఆదిపురుష్ లో ప్రభాస్ నే రాముడిగా తీసుకోవడానికి కారణం తెలుసా..?

ఆదిపురుష్ లో ప్రభాస్ నే రాముడిగా తీసుకోవడానికి కారణం తెలుసా..?

by Azhar
Ad

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు అనేవి చేస్తున్నాడు. ప్రస్తుతం సాలార్, ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్స్ లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటికే ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ అనేది ముగిసిపోయింది. కానీ ఇంకా ఈ సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ పనులు నడుస్తున్నాయి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Advertisement

ఇక ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ చేస్తున్నారు. హిందీలోనే తెరకెక్కతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషలో విడుదల అవుతుంది. అయితే హిందీలోనే షూట్ అవుతున్న ఈ సినిమాలో ఏ బాలీవుడ్ హీరోను కాకుండా టాలీవుడ్ కు చెందిన ప్రభాస్ ను ఎందుకు హీరోగా.. రాముని పాత్రలో తీసుకున్నారు అనే అనుమానం చాలా మందికి ఉంటుంది.

Advertisement

అయితే అందుకు సంబంధించిన కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా రామాయణం ఆధారంగా వస్తుంది. కాబట్టి దీనిపైన వివాదాలు అనేవి తప్పక వస్తాయి. కానీ ప్రభాస్ అలంటి వివాదాల్లోకి దూరే రకం కాదు. సైలెంట్ గా ఉంటాడు. అలాగే ప్రభాస్ తన పని తప్పించి మిగిలిన పనులలో కలుగజేసుకోడు. అందుకే ప్రభాస్ ను ఈ సినిమాలో రామునిగా అతిసుకోవాలని డైరెక్టర్ ఓం రౌత్ అనుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.

ఇవి కూడా చదవండి :

రోహిత్, కార్తీక్ లతో ప్రచారం చేస్తున్న మన పోలీసులు..!

భువీ వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading