Home » మరో హీరో కోసమే భోళా శంకర్ పక్కకు పెట్టిన చిరు…!

మరో హీరో కోసమే భోళా శంకర్ పక్కకు పెట్టిన చిరు…!

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెం150 సినిమా చేసిన చిరంజీవి.. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి అనే సినిమా తీశారు. ఇక ఆయా తర్వాత కరోనా కారణంగా వచ్చిన పెద్ద గ్యాప్ తర్వాత ఈ మాదే ఆచార్య అనే సినిమా చిరు నుండి వచ్చింది. కానీ ఇది పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయిన కూడా ఇప్పుడు చిరు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య అనే చిరంజీవి సినిమాలు ఇప్పుడు సెట్స్ పైన ఉన్నాయి.
కానీ ఇందులో గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య అనే సినిమాలు వేగంగా షూటింగ్ అనేది జరుపుకుంటుంటే.. భోళా శంకర్ అనే సినిమా మాత్రం షూటింగ్ జరుపుకోవడం లేదు. అయితే అందుకు కారణం మరో హీరో అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చిరు నుండి వచ్చిన ప్రతి సినిమాలో ఆయనతో పాటు మరో హీరో ఉంటున్న విషయం తెలిసిందే.  సైరా నరసింహారెడ్డిలో ఎంతోమంది స్పెషల్ పాత్రలో నటించగా.. తర్వాత వచ్చిన ఆచార్య సినిమాలో చిరుకి సపోర్ట్ గా రామ్ చరణ్ కనిపించాడు. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు.
ఇక అదే విధంగా వాల్తేరు వీరయ్య అనే సినిమాలో చిరంజీవితో పాటుగా మాస్ మహారాజ రవితేజ కనిపించాబోతున్నాడు. ఈ మధ్యే ఈ విషయాని అధికారికంగా చిత్ర యూనిట్ అనేది ప్రకటించింది. అయితే అదే దారిలో ఈ  భోళా శంకర్ అనే సినిమాలో కూడా మరో హీరో ఉండాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే ఇప్పుడు చిత్ర యూనిట్ అనేది వేటలో పడినట్లు సమాచారం. భోళా శంకర్ సినిమాలో నటించడానికి మరో హీరో కోసం వెతుకుతున్నారు. ఆ మరో ఎవరో దొరికిన తర్వాతే భోళా శంకర్ షూటింగ్ అనేది ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading