యాంకర్ అనసూయ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆమెకు మంచి గుర్తింపు అనేది వచ్చింది అంటే అది జబర్దస్త్ వల్లే. 2013 లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఉన్న అనసూయ కొన్ని రోజులకు ఇందులోనుండి వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత దీనికి మంచి రేటింగ్స్ అనేవి రావడంతో మళ్ళీ తిరిగి వచ్చింది. ఇక ఇందులో మంచి పేరుతో పాటుగా డబ్బును కూడా సంపాదించింది.
ఇక ఈ జబర్దస్త్ వల్లే సినిమాల్లో కూడా అవకాశాలు అనేవి అందుకుంది అనసూయ. కానీ తాజాగా ఈ జబర్దస్త్ నుండి వెళ్ళిపోతూ.. సినిమాల్లో ఎక్కువ అవకాశాలు అనేవి వస్తున్నాయి అని.. అందుకే వెళ్ళిపోతున్నాను అని ప్రకటించింది. కానీ ప్రజలు మాత్రం ఆ విషయం నమ్మలేదు. వేరే షోల నుండి భారీ ఆఫర్ వచ్చింది అని… అందుకే అనసూయ వెళ్లిపోయింది అని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఇప్పుడు అదే నిజం అని తెలుస్తుంది.
అయితే జబర్దస్త్ మానేసిన అనసూయ ఇప్పుడు వేరే సింగింగ్ షోకు యాంకర్ గా వ్యవరిస్తుంది. అయితే అనసూయకు ఈ షో కోసం డబల్ రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చిందంట. మాములుగా జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కు 2.5 నుండి 3 లక్షల వరకు అనసూయకు వచ్చేది. కానీ ఈ సింగింగ్ షోలో ఆమెకు ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు 5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఆ కారణంగానే అనసూయ జబర్దస్త్ నుండి వెళ్ళిపోయింది అని సమాచారం. దాంతో అనసూయఫై కొన్ని విమర్శలు అనేవి కూడా వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :