Home » ఆ డైరెక్టర్ వల్లే అనసూయ జబర్దస్త్ వదిలేసిందట..!

ఆ డైరెక్టర్ వల్లే అనసూయ జబర్దస్త్ వదిలేసిందట..!

by Azhar
Ad
అనసూయ యాంకర్ గా.. నటిగా ఇప్పుడు చాలా మంచి గుర్తింపు అనేది తెచ్చుకుంది. అయితే ఆమెకు ఈ గుర్తింపు రావడానికి కారణం మాత్రం జబర్దస్త్ కార్యక్రమం అనే చెప్పాలి. ఆమె ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న కూడా.. జబర్దస్త్ లో యాంకర్ గా అభిమానులకు బాగా దగ్గర అయిన తర్వాతనే సినిమాలో కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా రావడం ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు అనసూయ.. చాలా మంది మాదిరే ఈ జబర్దస్త్ అనే కార్యక్రమాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి.
అయితే చాలా మంది జబర్దస్త్ రేటింగ్స్ పడిపోవడం.. అదే సమయంలో వేరే షో నుండి యాంకరింగ్ ఛాన్స్ రావడం వల్లనే అనసూయ ఈ జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అది ఒక్క కారణం అయిన ముఖ్యమైన కారణం మాత్రం కాదట. ఓ డైరెక్టర్ చెప్పిన కారణంగానే అనసూయ ఈ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు. టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒక్కరైనా క్రిష్. అయితే అనసూయ ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో తాను ముఖ్య పాత్రగా ఓ వెబ్ సిరీస్ చేయబోతున్న విషయం తెలిసిందే.
గురజాడ అప్పారావు రాసిన నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో అనసూయ వేశ్య పాత్రలో కనిపించబోతుంది. ఇక ఇందులో తానే ముఖ్యమైన పాత్ర అవ్వడం వల్ల కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తూ.. రెండు షోలను చేయడం చాలా కష్టం. అందుకే ఈ వెబ్ సిరీస్ కు ప్రాధాన్యత ఇస్తూ.. దీనికి పూర్తిగా డేట్స్ కేటాయించడం కోసమే అనసూయ జబర్దస్త్ షోను వదిలి వెళ్ళిపోయింది అని అంటున్నారు. ఇక ఈ నిర్ణయం తీసుకోవడానికి అనసూయ క్రిష్ సలహాని పాటించింది అని తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading