Home » Samantha: అమెరికాకు వెళ్ళిపోతున్న సమంత.. ట్రీట్ మెంట్ కోసమే కాదు.. అసలు కారణం ఏంటంటే?

Samantha: అమెరికాకు వెళ్ళిపోతున్న సమంత.. ట్రీట్ మెంట్ కోసమే కాదు.. అసలు కారణం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Ad

సమంత బ్రేక్ తీసుకోవడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఆమెకు ఉన్న మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తి కోలుకోవాలంటే కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది అని డాక్టర్లు సలహా ఇవ్వడంతో సమంత ఈ నిర్ణయం తీసుకుందని అందరు భావిస్తున్నారు. దీనితో ఇప్పటికే ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ ను పూర్తి చేసుకున్న సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Advertisement

అయితే.. రీసెంట్ గా ఖుషి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ కు సమంత, విజయ దేవరకొండ జంటగా కనిపించి ప్రమోషన్స్ ను అదరహో అనిపించారు. ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో హై లైట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా.. ఈ ఈవెంట్ పని పూర్తి అవ్వగానే సమంత అమెరికాకు ప్రయాణం అయ్యారు. దీనితో.. ఆమె ట్రీట్ మెంట్ ఇంకా పూర్తి కాలేదని, ట్రీట్ మెంట్ కోసమే సమంత అమెరికాకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

అయితే.. సమంత అమెరికా ట్రిప్ కు వెళ్లడం వెనక మరో కారణం కూడా ఉంది. నిజానికి సమంత ఖుషి సినిమా రిలీజ్ అయిపోయిన తరువాత అమెరికాకు వెళ్లాలని అనుకున్నారు. కానీ, ఇంతలోనే ఆమెకు ఓ అవకాశం వచ్చింది. ఈ నెల 20 వ తేదీన న్యూయార్క్ లో భారత దేశ స్వతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ పెరేడ్ లో పాల్గొనేందుకు సమంతకు అవకాశం వచ్చింది. దీనితో సమంత ఈ ఈవెంట్ లో పాల్గొనడం కోసం ముందుగానే అమెరికాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సమంత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఉండే అవకాశం లేదు. అందుకే సమంత మ్యూజిక్ కన్సర్ట్ లో సందడి చేసారు. అయితే ఈ ఈవెంట్ అయిపోయాక ఆమె తిరిగి ఇండియాకు వచ్చేస్తారా? లేక ట్రీట్మెంట్ అయ్యేవరకు ఉంటారా అన్న సంగతి తెలియాల్సి ఉంది.

మరిన్ని..

Kalki: ప్రభాస్ “కల్కి” నుంచి మరో ఇంటరెస్టింగ్ అప్ డేట్.. ఆ స్టార్ హీరో నటిస్తున్నారా?

అవార్డు వస్తే ఆ రోజు బ్రహ్మానందం ఏం చేస్తాడో తెలుసా? అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు!

Visitors Are Also Reading