మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఆరెంజ్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. మెగాబ్రదర్ నాగబాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఆ తరవాత మగధీర సినిమాతో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక ఆ తరవాత ఆరెంజ్ సినిమాతో వచ్చాడు. అయితే సినిమా పై భారీ అంచనాలు ఉండటం లవ్ స్టోరీ కావడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ALSO READ : Nani: దసరా లాంటి మూవీ మరోసారి చేయను..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
Advertisement
ఈ సినిమాను నిర్మించినందుకు నాగబాబు దారుణంగా నష్టపోయారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో నాగబాబుకు కోలుకోలేని దెబ్బ పడింది. అయితే ఈ సినిమా థియేటర్ లలో ఆడలేదు కానీ ఈ సినిమాకు చాలా మంది యూత్ కనెక్ట్ అయ్యారు. సినిమా విడుదలై టీవీలో ప్రసారమైన తరవాత సినిమాకు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ఈ సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో మ్యూజికల్ హిట్ గా కూడా ఈ సినిమా నిలిచింది.
Advertisement
ఇక రీసెంట్ గా ఈ సినిమాను రీరిలీజ్ చేయగా మూడు కోట్లకు పైగా కలెక్షన్ లు వచ్చాయి. రీరిలీజ్ లలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చిన మొదటి సినిమాగా ఆరెంజ్ నిలిచింది. అయితే ఆరెంజ్ సినిమా అంటే చాలా మందికి ఫేవరెట్ సినిమా కానీ ఆ సినిమాకు ఆరెంజ్ అనే పేరు ఎందుకు పెట్టారో మాత్ర తెలియదు.
సినిమాలో ఎక్కువగా నిజం మాట్లాడటం..నిజంగా ప్రేమించడం అనే పదాలు వింటూ ఉంటాం. కాగా ఆరెంజ్ అనే పదం ట్రూత్ ను రిప్రెజెంట్ చేస్తుంది. అందువల్లే ఈ సినిమాకు ఆరెంజ్ అనే టైటిల్ ను ఎంపిక చేశారని ఒక టాక్ ఉంది. మరోవైపు సినిమాలో చాలా సీన్ లలో ఆరెంజ్ కలర్ ను చూపించిన సంగతి కూడా తెలిసిందే.