Home » రీమేక్ సినిమాలకు స్వ‌స్తి ప‌లికిన నాని..కార‌ణం ఏంటంటే..1

రీమేక్ సినిమాలకు స్వ‌స్తి ప‌లికిన నాని..కార‌ణం ఏంటంటే..1

by AJAY
Ad

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ను మొద‌లు పెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన న‌టుడు నాని. త‌న న‌ట‌న‌తో నాని నాచుర‌ల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. వ‌రుస సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాని హీరోగా వ‌చ్చిన రీసెంట్ చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ కూడా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాలో డ్యూయ‌ర్ రోల్ చేసి నాని అల‌రించాడు.

NANI

NANI

మాస్ క్లాస్ ఇలా అన్ని పాత్ర‌లు చేయ‌గ‌ల న‌టుడు అని నానికి మంచి గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే నాని రీమేక్ సినిమాలు చేయకూడద‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. కానీ నాని ఇక‌పై రీమేక్ సినిమాలు చేయ‌న‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించారు. దానికి కార‌ణం కూడా వివ‌రించాడు. తాను కెరీర్ బిగినింగ్ లో ఆహా క‌ల్యాణం మ‌రియు భీమిలి క‌బడ్డీ సినిమాల‌ను చేశాన‌ని చెప్పారు.

Advertisement

Advertisement

కానీ ఇక‌పై మాత్రం రీమేక్ సినిమాలు చేయ‌న‌ని చెప్పారు. జెన్యూన్ ఒక‌టి క్రియేట్ చేయాల‌ని ఒక కొత్త క‌థ‌లోకి వెళ‌దామని తాను అనుకున్నాన‌ని చెప్పారు. త‌న‌లో ఉన్న ఒక కొత్త ద‌నాన్ని రీమేక్ లో చూపించ‌లేన‌ని చెప్పారు. భీమిలి క‌బ‌డ్డీ సినిమా చాలా మందికి నచ్చిందని ఆహా క‌ల్యాణం ఫ్లాప్ అయ్యింద‌ని అన్నారు.

ALSO READ : Shyam Singha Roy: ఇంత బాగున్నా సీన్ ని ఎలా డిలీట్ చేసారు ?

రీమేక్ సినిమాలు నేను చేయ‌న‌ని కానీ నా సినిమాలు వాళ్లు రీమేక్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం తాన సినిమాలు ఐదారు రీమేక్ అవున్నాయ‌ని అన్నారు. పాన్ ఇండియా సినిమా కాక‌పోయిన త‌న సినిమాను స‌బ్ టైటిల్స్ తో క‌న్న‌డ వాళ్లు మ‌ల‌యాళం వాళ్లు చూసి మెచ్చుకుంటే చాల‌ని అన్నారు.

Visitors Are Also Reading