సమాజంలో ఆడ,మగతో పాటూ హిజ్రాలు కూడా ఉంటారు. ఒకప్పుడు హిజ్రాలను గౌరవించేవారు కాదు కానీ ఇప్పుడు సమాజంలో వారికి కూడా తగిన గుర్తింపును ఇస్తున్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సైతం కల్పిస్తున్నారు. నిజానికి అది వాళ్ల హక్కు కూడా. ఇక సాధారణ ప్రజల కంటే హిజ్రాలు భిన్నమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబంతో కలిసి ఉండటం కంటే వాళ్ల సంఘంతో కలిసి ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు. సంఘం లోని పెద్ద వారికి గురువుగా మరియు తల్లి గా ఉంటారు.
Advertisement
వాళ్ల ఆజ్ఞలను అనుసరించే సంఘంలోని ఇతర సభ్యులు కూడా నడుచుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కుటుంబ వ్యవహరాలను కూడా సంఘంలోని పెద్ద చూసుకుంటారు. అంతే కాకుండా వారి సంఘంలోని సభ్యులనే అక్కా, వదిన, అత్త అంటూ వరసలు పెట్టుకుని పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే హిజ్రాలు ఎక్కడ కనిపించినా చప్పట్లు కొడుతూ కనిపిస్తూ ఉంటారు. అంతే కాకుండా వాళ్లు కొట్టే చప్పట్లు కూడా సాధారణంగా సభలు, పాఠశాలల్లో కొట్టే చప్పట్లతో భిన్నంగా ఉంటాయి.
Advertisement
సభలు పాఠశాలల్లో చప్పట్లు కొట్టేటప్పుడు రెండు చేతులు నిలువుగా పెట్టి కొడతారు. కానీ హిజ్రాలు మాత్రం చప్పట్లు కొట్టేటప్పుడు ఒక చేతిని అడ్డంగా మరో చేతిని నిలువుగా పెట్టి కొడుతుంటారు. అయితే అలా చప్పట్లు కొట్టడం వెనక కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిజ్రాలు చప్పట్లు కొడుతూ తమ ఉనికిని చాటుకుంటారు.
అలా చప్పట్లు కొట్టడం వల్ల శబ్దం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంతే కాకుండా అలా చప్పట్లు కొట్టడం ద్వారా తమలాంటి వారిని అంటే తమ సంఘ సభ్యులను గుర్తిస్తారట. కొంత మంది హిజ్రాలు మహిళల వేషదారణలో ఉంటే మరి కొందరు పురుషుల వేషదారణలో ఉంటారట. అలాంటి వారిని గుర్తించేందుకు చప్పట్లు కొడతారట. ఆనందాన్ని వ్యక్తపరచడానికి మరియు కోపాన్ని వ్యక్తపరచడానికి కూడా చప్పట్లను కొడతారట.
also read : పరిగడుపున గోరు వెచ్చని నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా…?