Home » “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ ఎలా వచ్చిందో తెలుసా…? దాని వెనక ఉంది ఎవరంటే…!

“పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ ఎలా వచ్చిందో తెలుసా…? దాని వెనక ఉంది ఎవరంటే…!

by AJAY
Ad

క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రాష్మిక మందన హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా సునీల్, అనసూయ, రావు రమేష్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లాంటి నటినటులు ప్రధాన పాత్రలో నటించారు. ఇదివరకే సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక పుష్ప తో వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ నమోదయింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఈ సినిమా సెలబ్రిటీలకు సైతం తెగ నచ్చేసింది. ముఖ్యంగా క్రికెటర్లకు పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజం డైలాగులు ఎంతగానో నచ్చేసాయి.

Advertisement

దాంతో ఏకంగా క్రికెట్ స్టేడియంలో…. సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా పుష్ప డైలాగులు మరియు మేనరిజం ను అనుకరిస్తూ వీడియోలు చేశారు. దాంతో గ్లోబల్ వైడ్ గా పుష్ప రేంజ్ వెళ్ళిపోయింది. ఇక సినిమా విడుదలకు ముందే సినిమాలోని శ్రీవల్లి పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ పాటలో నడిచిన వాకింగ్ స్టైల్ చాలా వైరల్ అయింది.

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వాకింగ్ స్టైల్ ఎలా వచ్చింది…? ఆ మ్యానరిజం బన్నీకి ఎవరు నేర్పించారు అన్నది బయటపెట్టాడు. శ్రీవల్లి పాట చేస్తున్నప్పుడే సుకుమార్ తనతో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా డిఫరెంట్ గా ఏదైనా చేయాలని తనతో చెప్పాడని అన్నారు. అంతేకాకుండా నువ్వు చేయబోయేది ప్రతి ఒక్కరూ అనుకరించాలని చెప్పాడని అన్నారు. దాంతో తానే సొంతంగా అలా నడవడం మొదలు పెట్టానని తెలిపాడు. అలా బన్నీ తన సినిమాలో తానే ఒక కొత్త వాకింగ్ స్టైల్ ను కనిపెట్టి ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

Visitors Are Also Reading